1986లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ధర ఎంత ఉందో తెలుసా..? తెలుసుకున్నారు అంటే షాక్ అయిపోతారు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ ఇండియాలో అత్యంత ప్రచారం పొందిన మోటార్ సైకిల్ లో ఒకటి అన్న విషయం మనకి తెలుసు. కాలానుగుణంగా ఈ మోటార్ సైకిల్ డిజైన్ మారినప్పటికీ బైక్ మోడల్ దాదాపు అదేవిధంగా ఉంది. బహుశా అందుకేనేమో ఈరోజుకి కూడా ఈ బైక్ పై ప్రజల్లో ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ తన బైక్ ల ఫీచర్లని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. దీంతో ప్రజాధరణ విషయంలో కూడా ఏ మాత్రం మార్పు రాలేదు. కొత్త ఫీచర్లు కారణంగా మోటార్ సైకిల్ ధర గణనీయంగా పెరిగింది.
Advertisement
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధరణి పరిశీలించి చూసినట్లయితే, ప్రస్తుతం ఇది రూ.1,50,795 నుండి రూ.1,65,715 దాకా ఉన్నట్లు తెలుస్తోంది. దీని టాప్ మోడల్ ధర రెండు లక్ష కంటే ఎక్కువ ఉంది. ఇది ఆన్ రోడ్ లోకి వచ్చే టైం కి ఈ బుల్లెట్ మీకు రెండు నుండి రెండున్నర లక్షల వరకు ఉంటుంది. ఈరోజుల్లో ఈ విలాసవంతమైన బైక్ ఒకప్పుడు నెల పాకెట్ మనీ మాత్రమేనని మీకు తెలుసా..?
Advertisement
1986 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ బిల్ ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి అప్పట్లో బుల్లెట్ ఇంత తక్కువ అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు లక్షల పలుకుతున్న ఈ బైక్ ధర అప్పుడు రూ.18,700 మాత్రమే. ఈ బిల్లు 1986 నాటిది. దాదాపు 30 ఏళ్ల క్రితం జార్ఖండ్ రాష్ట్రం లో సందీప్ ఆటో కి చెందిన బుల్లెట్ 350 మోడల్ బిల్లు ఇది. 1986లో ఎన్ఫీల్డ్ బుల్లెట్ అని పిలిచేవారు. రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్ఫోలియోలో ఓల్డ్ బైక్ బుల్లెట్. ప్రస్తుతం బుల్లెట్ 350 బుల్లెట్ 350 ఈఎస్ మోడల్స్ అందుబాటులో వున్నాయి. ప్రస్తుత బుల్లెట్ 350 బరువు 191 కిలోలుగా ఉంది. లీటర్ కి 37 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!