Home » ప్రపంచంలోనే రెండో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్…!

ప్రపంచంలోనే రెండో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్…!

by Azhar
Ad
ప్రపంచంలోనే రెండో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్…!
2008లో ప్రారంభమైన ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇందులో పాల్గొనే జట్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఇందులో ప్రస్తుతం 10 జట్లే ఉన్న మూడు నాలుగు జట్లకు మాత్రమే విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. అందులో ఒక్క జట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్. ఇప్పుడు ఈ జట్టు ఓ కొత్త చరిత్రను సృష్టించింది. ప్రపంచ క్రికెట్ లో ఏ జట్టుకు సాధ్యం కానీ రికార్డును నెలకొల్పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రీడా జట్లలో సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఉన్న జట్లలో బెంగళూర్ రెండో స్థానంలో ఉంది.
తాజాగా ఓ సమస్త చేసిన సర్వ్ ప్రకారం అన్ని స్పోర్ట్స్ టీమ్స్ లో ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉన్న జట్లలో పుటాలు లోని రియల్ మాద్రి జట్టు మొదటి స్థానంలో ఉంది. ఈ జట్టుకు సోషల్ మీడియాలో 321 మిలియన్స్ ఎంగేజ్మెంట్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో మన ఐపీఎల్ లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు రెండో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ కు సోషల్ మీడియాలో మొత్తం 190 మిలియన్స్ ఎంగేజ్మెంట్ ఉంది. ఇక అలాగే బార్సిలోనా జట్టు 179 మిలియన్స్ ఎంగేజ్మెంట్ తో మూడో స్థానంలో ఉంది.
అయితే ఈ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ను లైక్స్, ఫాలోవర్స్, కామెంట్స్ అలాగే రి ట్వీట్స్ లాంటిని పరిగణలోకి తీసుకొని లెక్కించారు. అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంట సోషల్ మీడియా వేదికలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే గత ఏడాది ఇదే లిస్ట్ లో 8వ స్థానంలో నిలిచినా బెంగళూర్ ఇప్పుడు 2వ స్థానానికి రావడానికి ముఖ్య కారణం కోహ్లీనే. ఎందుకంటే ఈ ఐపీఎల్ లో కోహ్లీ అనుకున్న విధంగా రాణించలేదు. దాంతో కోహ్లీ ఫామ్ పై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. అలాగే ఇప్పుడు ఐపీఎల్ లో బెంగళూర్ ప్లే ఆఫ్స్ కు చేరడం కూడా ఈ ఎంగేజ్మెంట్ పెరగడానికి మరో కారణం అని చెప్పవచ్చు.

Advertisement

Visitors Are Also Reading