ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తన అందచందాలతో, నటనా చాతుర్యంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ రోజా.. ఆమె శ్రీలత రెడ్డి గా ఉన్న తన పేరును రోజా గా మార్చుకున్నారు.. ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్ కొట్టిన రోజా పాలిటిక్స్ లో కూడా తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు..
రోజా సినిమా రాజకీయ విషయాలను పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితంలో నటిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత చెంబురతి అనే మూవీ ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
Advertisement
ఈ మూవీని సెల్వమణి దర్శకత్వంలో చేశారు. షూటింగ్ సమయంలోనే రోజా మరియు సెల్వమణి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే రోజా సినిమాల్లో నటించడం కోసం తన సోదరులు వారి జీవితాన్ని త్యాగం చేసి ఆమెకు సహకరించారట.. దీంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత రోజా ఎలాగైనా వారి సోదరులను సెటిల్ చేయాలని ఆ ప్రేమ వ్యవహారాన్ని 11 సంవత్సరాలపాటు కొనసాగిస్తూ పెళ్లి చేసుకోకుండా వచ్చిందట. చివరికి వారి సోదరులను జీవితంలో స్థిరపరచి, 2002 లో దర్శకుడు సెల్వమణితో వివాహం జరిగిందని ఆమె వెల్లడించింది.
Advertisement
పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైన రోజా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. దీని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రోజా బుల్లితెర కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది.. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం లో ఈమె మంత్రి పదవి చేపట్టడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమైందని చెప్పవచ్చు.
ALSO READ:
- టాలీవుడ్ లోని ఈ హీరోల హైట్ ఎంతో మీకు తెలుసా..?
- కీలక నిర్ణయం తీసుకున్న మీనా.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..!!