తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా అంటే తెలియని వారు ఉండరు.. ఆమె ఎన్నో సినిమాలు తీసి అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది.. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో ఆమె తెరపై కనిపించింది. ఆమె తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజలతో మమేకమై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి మంత్రిగా పని చేస్తున్నారు. ఆమె సినిమాల్లో ఏ విధంగా అయితే పేరు తెచ్చుకుందో బుల్లితెర ఫేమస్ ప్రోగ్రాం జబర్దస్త్ లో కూడా జడ్జిగా చేసి మరింత పేరు ను సంపాదించుకుంది.
Advertisement
ఇలా సినిమాల పరంగా, రాజకీయపరంగా ఎంతో బిజీగా ఉండే రోజా తనకు ఏ మాత్రం టైం దొరికినా తన కుటుంబంతో గడపడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే రోజా తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇదే తరుణంలో రోజా తన కూతురు గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నా కూతురు పుట్టిన రోజు కావడంతో ఒక నోట్ రాశారు. డియర్..థాంక్యూ నువ్వు నా కూతురువి కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా, నన్ను ఇంతల అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ అంటూ..
also read:ఖమ్మం జిల్లాలో దారుణం..ఆ యువకుడు చేసిన పనికి ఊరు ఊరంతా అక్కడే..అసలు ట్విస్ట్ ఏంటంటే..?
తన కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కూతురు అన్షు మాలిక గురించి రోజా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇంత చిన్న వయసులో ఎంతో టాలెంటు ఈమె తన తల్లి లాగే సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె కూడా తల్లి బాటలో ఇండస్ట్రీలోకి రానుందని తెలుస్తోంది. కానీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.
also read: