పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లానాయక్ ఈ నెల 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెసిందే. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకు కలెక్షన్ల వర్ష కురుస్తోంది. అయితే ఏపీ మాత్రం థియేటర్ల పై ఆంక్షల నేపథ్యంలో సినిమా డిస్ట్రిబ్యూటర్ లు నష్టపోయే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ అభిమానులు అనుకుంటున్నారు.
అంతే కాకుండా ఏపీ సర్కార్ పై విమర్శలు కరిపిస్తూ తెలంగాణ సర్కార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో టికెట్ ధరలపై నియంత్రణ లేకపోవడం…ఎక్కువ షోలకు అనుమతులు ఇవ్వడంతో సీఎం కేసీఆర్ పై కూడా ప్రశంసలు కురిపిస్తూ ఏపీలో పవన్ అభిమానులు థియేటర్ల వద్ద కేసీఆర్ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఇదే వివాదం పై తాజాగా వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే రోజా స్పందించారు.
Advertisement
Advertisement
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ….భీమ్లా నాయక్ టికెట్ ధరలు పుష్ప, అఖండ సినిమాలతో సమానంగానే ఉన్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా టికెట్ ల ధరలు ఏపీ ప్రభుత్వం తగ్గించాల్సిన అవసరం లేదని అన్నారు.
సినీపెద్దలు సీఎం జగన్ ను కలిశారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల నిర్ణయం వల్ల అంతిమ సమావేశం రద్దయ్యిందని చెప్పారు. చంద్రబాబు మాటలను పవన్ కల్యాణ్ వింటూ రాజకీయ లబ్ది పొందడం సరికాదన్నారు. అంతే కాకుండా తెలంగాణలో టికెట్ ధర రూ.300 ఉంటే ఏపీలో రూ.150 అని ఆ రకంగా చూసుకుంటే పవన్ ఫ్యాన్స్ కు సీఎం జగన్ మంచి చేశారని చెప్పారు.