ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా ఈరోజు టీం ఇండియా శ్రీలంక జట్టుతు డు ఆర్ డై మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వరుస వికెట్లు కోల్పోయిన జట్టుకు కెప్టెన్ రోహిత్ షమ ఆదుకున్నాడు అనే చెప్పాలి. 41 బంతుల్లో 72 పరుగులు చేసిన రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ను అందరికి చూపించాడు. అయితే ఈ పరుగులతో రోహిత్ రికార్డుల మోత మోగించాడు అనే చెప్పాలి.
Advertisement
అయితే ఈరోజు రోహిత్ చేసిన అర్ధ శతకం కోహ్లీ రికార్డును సమం చేసింది. చివరిగా పాక్ తో ఆడిన మ్యాచ్ లో గ్యాప్ సెంచరీ చేసి టీ20 ఇంటర్నేషనల్ లో అత్యధిక 50+ పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలవగా.. ఇప్పుడు ఈ మ్యాచ్ లో రోహిత్ 72 పరుగులు చేసిన కోహ్లీ రికార్డును సమం చేసాడు. ఈ ఇద్దరు ఇప్పటివరకు 32 సార్లు ఈ ఘనత అందుకున్నారు.
Advertisement
ఇక ఈరోజు రోహిత్ చేసిన పరుగులతో ఆసియా కప్ లో 1000 పరుగులు చేసిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 971, విరాట్ కోహ్లీ 920 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అలాగే ఆసియా కప్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ సచిన్ తో కలిసి సమానంగా నిలిచాడు. రోహిత్, సచిన్ ఇద్దరు ఆసియా కప్ లో 9 సార్లు అర్ధ శతకం అనేది చేసారు. ఇక కోహ్లీ 7 సార్లు ఈ ఫిట్ అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి :