Home » టీమిండియా ఫాన్స్ కు షాక్..రోహిత్, రాహుల్, కోహ్లీ రిటైర్మెంట్ ఫిక్స్…!

టీమిండియా ఫాన్స్ కు షాక్..రోహిత్, రాహుల్, కోహ్లీ రిటైర్మెంట్ ఫిక్స్…!

by Bunty
Ad

వరల్డ్ కప్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భారత జట్టు యంగ్ ప్లేయర్లు చెలరేగిపోతున్నారు. సొంతగడ్డపై జరుగుతున్న టి20 సిరీస్ లో ఆసీస్ పై వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. విశాఖమ్యాచ్ లో గెలిచి జోరు మీద ఉన్న యువ భారత్ తిరువనంతపురం వేదికగా జరిగిన రెండవ మ్యాచ్ లోను అదరగొట్టింది. బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసి బౌలింగ్ లో చెలరేగి ఆసీస్ ను చిత్తుచేసింది. ఓపెనర్లు జైస్వాల్, గైక్వాడ్ అదిరిపోయే ఆరంభం ఇస్తుంటే….తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో రాణిస్తున్నారు.

Advertisement

ఇక చివరిలో రింకు సింగ్ బ్యాట్ జులిపిస్తున్నాడు. మొత్తానికి యంగ్ ఇండియా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తుండటం, దీంతో సీనియర్లకు విశ్రాంతి తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జట్టు మేనేజ్మెంట్ సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ, బుమ్రా, సిరాజ్ లకు విశ్రాంతి ఇచ్చింది. ప్రపంచకప్ ఆడిన జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ద్ కృష్ణలు మాత్రమే ఆసిస్ లతో జరుగుతున్న టి20 సిరీస్ ఆడుతున్నారు. ఈ క్రమంలో భారత యువ ప్లేయర్ల అంచనాలు మరింత పెరిగాయి. యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలు బ్యాట్ తో రాణిస్తుండటంతో నెక్స్ట్ జనరేషన్ కు డోకా లేదు అనిపిస్తుంది.

Advertisement

దీంతో ఇప్పటి నుంచే యువకులపై మేనేజ్మెంట్ ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. మేనేజ్మెంట్ అనుకునేదాన్ని బట్టి చూస్తే వచ్చే టి20 ప్రపంచ కప్ లో భారత్ పూర్తిగా యువ ప్లేయర్లతో బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లను t20 ల నుంచి పక్కన పెడితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. బీసీసీఐ కూడా రోహిత్, కోహ్లీలు టి20లో కొనసాగాలా? వద్దా? అనేది వారికి వదిలేసినట్టు తెలుస్తోంది. మరి రోహిత్, రాహుల్, కోహ్లీ లేని టి20 ఫార్మాట్ ఎలా ఉండబోతుందో, దీనిపై క్రికెట్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading