Home » ప్రపంచ కప్ జట్టులో షమీ లేకపోవడానికి కెప్టెన్ కారణమా..?

ప్రపంచ కప్ జట్టులో షమీ లేకపోవడానికి కెప్టెన్ కారణమా..?

by Azhar
Ad

భారత సీనియర్ పేసర్లలో ఒక్కడు అయిన మొహ్మద్ షమీని ఈ మధ్య సెలక్టర్లు టీ20 ఫార్మాట్ కు దూరం పెడుతూ వస్తున్నారు అనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే బుమ్రా లేకపోయినా ఆసియా కప్ కోసం షమీని ఎంపిక చెయ్యక.. పెద్ద మూల్యం అనేది చెల్లించుకున్నారు. అందువల్ల షమీని వచ్చే నెలలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కు అయిన సెలక్ట్ చేయాలనీ వాదన బ్లంహా వినిపించింది.

Advertisement

కానీ నిన్న బీసీసీఐ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో షమీ.. ముఖ్యమైన 15 మంది జట్టులో కాకుండా.. స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నాడు. అందువల్ల మళ్ళీ సెలక్టర్లపై విమర్శలు అనేవి ప్రారంభం అయ్యాయి. కానీ షమీ జట్టులో లేకపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మ కారణం అని తెలుస్తుంది. అయితే జట్టులోని 15 మందిలో 14 మంది ప్లేయర్స్ ను సెలక్టర్లు అందరూ కలిసి ఎంపిక చేశారట.

Advertisement

కానీ చివతి ఆటగాడిగా అశ్విన్, షమీలో ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయం అర్ధం కాగా.. ఆ అవకాశాని రోహిత్ అలాగే ద్రావిడ్ కు ఇచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడు రోహిత్ షమీ కాకుండా.. అశ్విన్ కు ఓటు వేయడంతో.. ద్రావిడ్ కూడా అందుకు మద్దతు అనేది ఇచ్చాడట. అందుకే అశ్విన్ జట్టులోకి తీసుకొని షమీని స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ నిర్ణయం జట్టుకు ఎంత సహాయం చేస్తుంది అనేది.

ఇవి కూడా చదవండి :

లంక విజయానికి కారణం ఆ ఒక్కటే..!

పంత్ కు ఊర్వశి సారీ..!

Visitors Are Also Reading