బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరగబోతున్న తొలి టెస్ట్ కి రోహిత్ శర్మ దూరం అవుతున్నారు. ఈ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా చేరుకుని ప్రాక్టీస్ చేస్తోంది. నవంబర్ 22-26 మధ్యాహ్నం టెస్ట్ జరగబోతుంది. రోహిత్ శర్మ తన భార్య రెండోసారి ప్రెగ్నెంట్. ఆమె కోసం ఉండిపోయాడు. శుక్రవారం రాత్రి రోహిత్ శర్మ భార్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో వారం రోజులు టైం ఉండడంతో హిట్ మ్యాన్ అప్పట్లోగా అసిస్ చేరుకొని తొలి టెస్ట్ ని ఆడతాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అలా జరగలేదు. రోహిత్ శర్మ ఆట నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్ కి అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది.
Advertisement
Advertisement
ఇప్పటికే బీసీసీఐ సహా సీనియర్ సెలక్షన్ కమిటీకి కూడా సమాచారం ఇచ్చారట. ఇప్పుడు దాకా బీసీసీఐ నుంచి మాత్రం దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. రోహిత్ కనుక అందుబాటులో లేకపోతే ఆయన ప్లేస్ లో బుమ్రా సారధిగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. రోహిత్ శర్మ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి జరగబోతున్న రెండవ టెస్ట్ కి అందుబాటులో ఉంటానని బీసీసీఐకి చెప్పారు.
Also read:
రెండు రోజులు కాన్బెర్రాలో ఆస్ట్రేలియా దేశవాళీ టీమ్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్, భారత్- ఏ జట్ల మధ్య 2 రోజుల వార్మప్ మ్యాచ్ జరగనుంది. దీని కంటే ముందు ఆశిష్ చేరుకుని వార్మప్ మ్యాచ్ కూడా ఆడతానని రోహిత్ సమాచారం అందించాడు. రోహిత్ దూరం అవ్వడంతో పాటుగా గిల్ కి గాయం అవ్వడం వంటివి చోటు చేసుకున్నాయి. మరి జట్టులో ఎవరు ఆడ బోతున్నారనేది చూడాలి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!