Home » మంత్రి రోజాకు ఏమైంది..? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

మంత్రి రోజాకు ఏమైంది..? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

ఆర్కే రోజా ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో రోజా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగింటి అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తెలుగుతో పాటు ఇతర భాషలోనూ సినిమాలు చేశారు. దాదాపు ఒకప్పటి స్టార్ హీరోలు అందరితోనూ రోజా సినిమాలు చేశారు. ఆ తర్వాత రోజా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదట టిడిపిలో చేరిన రోజా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయారు.

Advertisement

 

ఆ తర్వాత వైసీపీలోకి చేరారు. రెండుసార్లు రోజా పరిగి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. దాంతో సీఎం జగన్ ఆమెకు మంత్రి పదవిని సైతం కట్టబెట్టారు. ప్రస్తుతం రోజా మంత్రిగా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా కాలం పాటు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను అలరించిన రోజా మంత్రి అయిన తర్వాత ఆ కామెడీ షో కు గుడ్ బై చెప్పారు. పూర్తి సమయం ప్రజాసేవకే కేటాయిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రోజా ఆసుపత్రిలో చేరారు. కాలునొప్పి… అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

శుక్రవారం రాత్రి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో రోజా గడిపారు. ఈ క్రమంలో ఆమె కాలు వాపు కు గురయ్యారు. నొప్పి ఎక్కువ అవ్వడంతో అర్ధరాత్రి కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మరొక రోజు రోజాకు వైద్యులు చికిత్స చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రోజా ఆస్పత్రిలో చేరడంతో రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేకపోతున్నారు. దాంతో ఆమె అభిమానులు రోజా మేడం గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading