Home » Mega family : లావణ్య తర్వాత మెగా ఇంటికి మరో హీరోయిన్ కోడలు కాబోతోందా..?

Mega family : లావణ్య తర్వాత మెగా ఇంటికి మరో హీరోయిన్ కోడలు కాబోతోందా..?

by Bunty
Ad

మెగా ఇంటి కుటుంబానికి మరో స్టార్ హీరోయిన్ కోడలు కాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తలను చాలామంది నిజం అనే చెబుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలోనే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహబంధంతో ఒకటవబోతున్నారు. వీరిద్దరూ వారి ప్రేమని చాలా రహస్యంగా ఉంచారు. వీరి ప్రేమకు సంబంధించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వాటిపై ఎవరు స్పందించలేదు. ఇక వీరి ఎంగేజ్మెంట్ రోజునే వీరి ప్రేమ విషయం బయటపడింది.

rituvarma is going to be daughter in law of mega family

rituvarma is going to be daughter in law of mega family

ఇక వీరు ఈ మధ్యకాలంలో వారి కుటుంబసభ్యులతో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ మెగా ఇంటి ఫంక్షన్స్ కి వస్తు వెళుతోందట. కేవలం కుటుంబసభ్యులు కలిసి జరుపుకునే ఫంక్షన్స్ కి కూడా ఆ హీరోయిన్ వెళుతుందని సమాచారం అందుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ‘పెళ్లిచూపులు’ సినిమాతో తెలుగు అభిమానులను అలరించిన అందాలతార రీతు వర్మ. ఈ మధ్యకాలంలో రీతు వర్మ మెగా కుటుంబంతో చాలా బాగా కలిసిపోతోందని, వారి కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్స్ కి వెళుతోందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Advertisement

మరి తాను ఎవరిని ప్రేమిస్తుందో తెలియదు కానీ మెగా ఇంటికి మాత్రం కోడలుగా వెళ్లబోతోందట. రీతు వర్మ మెగా హీరోను ప్రేమించిందని, ఇరు కుటుంబసభ్యులు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఆ హీరో ఎవరో తెలియదు కానీ సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ వీరిద్దరిలో ఎవరో ఒకరు అయి ఉంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఈ జంట కూడా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాదిరిగా ఎంగేజ్మెంట్ రోజునే వారి ప్రేమ విషయాన్ని బయట పెడతారేమోనని అనుకుంటున్నారు. ఇక రీతు వర్మ ఏ హీరోని ప్రేమిస్తుందో వారు చెప్పే వరకు వేచిచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading