బియ్యం కడిగిన నీళ్లతో, అందాన్ని రెట్టింపు చేసుకోవొచ్చు. చాలామందికి ఈ విషయం తెలియదు. దుమ్ము ధూళి కాలుష్యం అలానే మేకప్ వలన చర్మం పాడైపోతూ ఉంటుంది. చర్మ సంరక్షణలో బియ్యం నీళ్లు బాగా పనిచేస్తాయి. రైస్ వాటర్ తో ముఖాన్ని కడుక్కుంటే చాలా ప్రయోజనాల ని పొందవచ్చు. బియ్యం కడిగిన నీళ్లు చర్మానికి బాగా ఉపయోగపడతాయి. ఇంట్లో రోజూ మనం బియ్యాన్ని కడుగుతుంటాము ఈ నీటిని ముఖం కడుక్కోడానికి ఉపయోగిస్తే చాలా చక్కటి ప్రయోజనాలు ఉంటాయి.
Advertisement
Advertisement
చాలామంది మార్కెట్లో దొరికే రైస్ వాటర్ ఫేస్ వాష్లని వాడుతుంటారు అలా కాకుండా మనం ఈ నీళ్ళని ముఖం కడుక్కోడానికి వాడితే అద్భుతమైన లాభం ఉంటుంది. పైగా కెమికల్స్ కూడా ఉండవు. బియ్యం కడిగిన నీళ్లు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మం పై పేరుకుపోయిన మేకప్, నూనెని కూడా తొలగిస్తాయి. అలానే సీజన్ మారేటప్పుడు చర్మం పొడిబారి పోతూ ఉంటుంది. బియ్యం నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పొడిబారిపోవడం తగ్గుతుంది. ప్రతిరోజు మీరు ఈ నీటి తో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు బియ్యం కడిగిన నీటిని టోనర్ లాగా ముఖంపై స్ప్రే చేసుకోవాలి. కాటన్ బాల్ తో ముఖాన్ని తుడుచుకోవాలి అప్పుడు చర్మం పై మురికి మేకప్ నూనె వంటివి తొలగిపోతాయి.
Also read:
- మానసిక ప్రశాంతత ని పొందాలని చూస్తున్నారా..? అయితే ఇవి తప్పక పాటించండి..!
- ఈ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోండి.. ఎముకల్ని బలంగా మార్చేసుకోవచ్చు…!
- చాణక్య నీతి: కాకి నుండి మనిషి.. ఈ 4 విషయాలు నేర్చుకోవాల్సిందే…!