Home » మ‌రోసారి జీహెచ్ఎంసీ మేయ‌ర్ ను టార్గెట్ చేసిన వ‌ర్మ‌…అప్పుడేమో అలా ఇప్పుడు ఇలా..!

మ‌రోసారి జీహెచ్ఎంసీ మేయ‌ర్ ను టార్గెట్ చేసిన వ‌ర్మ‌…అప్పుడేమో అలా ఇప్పుడు ఇలా..!

by AJAY
Ad

రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవ‌తుందేమో. ఒక‌ప్పుడు టాలీవుడ్ లో శివ లాంటి ట్రెండ్ సెట్ట‌ర్ సినిమాను తీయ‌డంతో పాటూ బాలీవుడ్ లో స‌ర్కార్ లాంటి సినిమాను తెర‌కెక్కించాడు. కానీ ప్ర‌స్తుతం ఆర్జీవీ ట్రాక్ తప్పాడు. వ‌రుస సినిమాలు చేసినా ఒక్క హిట్ ప‌డ‌టం లేదు. అంతే కాకుండా ఫుల్ గా తాగేసీ స్టేజిల మీద‌నే డ్యాన్స్ లు వేస్తున్నాడు. అంతే కాకుండా సినిమాల కంటే టీవీ ఇంట‌ర్వ్యూల‌తోనే ఎక్కువ‌గా బిజీగా గ‌డుపుతున్నాడు.

Advertisement

ఇక వ‌ర్మ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ‌రిని టార్గెట్ చేస్తాడో చెప్ప‌టం చాలా క‌ష్టం. సినిమావాళ్లు రాజ‌కీయనాయ‌కులు అంటూ ఎలాంటి తేడా చూడ‌కుండా అంద‌రిపై సెటైర్ లు వేస్తుంటాడు. కాగా తాజాగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో వీధి కుక్కుల ఓ బాలుడి పై దాడి చేసి హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం సైతం కుక్క‌ల‌ను అరిక‌ట్టేందుకు యుద్ద‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.

Advertisement

RamGopal Varma

RamGopal Varma

కాగా ఆర్జీవీ జీహెఎచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మిపై సెటైర్ వేస్తూ పోస్ట్ పెట్టాడు. ట్విట్ట‌ర్ లో మేయ‌ర్ ను ట్యాగ్ చేసి….మీరు మీ పోస్ట్ కు రాజీనామా చేసి కుక్క‌లు అన్నింటిని మీ ఇంటికి ఎందుకు తీసుకువెళ్ల‌కూడ‌దు. వాటిని తీసుకువెళ్లి మీరు భోజ‌నం పెడితే అవి మా పిల్ల‌ల జోలికి రావు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. అంతే కాకుండా మేయ‌ర్ రీసెంట్ గా మాట్లాడుతూ..కుక్క‌లు ఆక‌లితో ఉన్నాయి అందువల్లే పిల్లాడిపై దాడి చేశాయి అంటూ చేసిన కామెంట్ ల‌పై సైతం ఫైర్ అయ్యాడు. పిల్ల‌ల ప్రాణం కంటే కుక్కల ఆక‌లి గురించి ఆలోచించ‌డం ఏంట‌ని ఫైర్ అయ్యాడు. కుక్కల‌ను మీ ఇంటికి తీసుకువెళితోనే పిల్ల‌లు స‌రక్షితంగా ఉంటార‌ని పేర్కొన్నాడు.

Visitors Are Also Reading