సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాల కంటే ఆయన మాటలనే అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ ఫిలాసఫీకి మరియు లైఫ్ స్టైల్ కు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. వర్మ ఇంటర్వ్యూలను ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తూ ఉంటారు. వర్మ చెప్పిన జీవిత సత్యాలను స్టేటస్ లుగా పెట్టుకుంటారు.
దానికి కారణం ఆర్జీవీ సాంఘిక, రాజకీయ ఇతర అంశాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ ఉండటమే. ప్రతి విషయాన్ని ఆర్జీవీ క్షుణ్ణంగా పరిశీలించి దానిని విశ్లేషిస్తూ ఉంటాడు. మరోవైపు అర్జీవి ఏ అంశంపైన అయినా స్పందించే తీరు డిఫరెంట్ గా ఉంటుంది. దాంతోనే అతడిని ఎక్కువ మంది అభిమానిస్తూ ఉంటారు. ఇక ఫ్యామిలీ కి దూరంగా సింగిల్ లైఫ్ గడుపుతూ తనకు ఏది నచ్చితే అదే చేస్తూ కూడా ఆర్జీవి మిగతా వాళ్ళ కంటే ప్రత్యేకం అనిపించుకుంటారు.
Advertisement
Advertisement
బ్రతికితే ఆర్జీవిలా బ్రతకాలని అనుకునేళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆర్జీవీ పలు చిత్రాలు వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఆర్జీవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ సీజన్ 6 నుండి ఆర్జీవీకి ఆఫర్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆర్జీవీ కనక బిగ్ బాస్ లో కి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రోజుకు 20 లక్షల రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని నిర్వాహకులు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కరోనా కాలంలో సినిమా షూటింగ్లు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ కూడా బిగ్ బాస్ ఆఫర్ ను ఒప్పుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే సీజన్ 6 మాత్రం ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సీజన్ కు కూడా తానే హోస్ట్ గా చేస్తానని నాగ్ క్లారిటీ కూడా ఇచ్చారు.
also read: Bangarraju Twitter Review: బంగార్రాజు ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే..?