Home » RGV గారి అల్లుడు ఎవరు? రామ్ గోపాల్ వర్మ భార్య ఎవరు?

RGV గారి అల్లుడు ఎవరు? రామ్ గోపాల్ వర్మ భార్య ఎవరు?

by Bunty
Ad

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి నెట్టింట్లో హల్చల్ చేస్తూనే ఉంటాడు. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలను విమర్శిస్తూ జగన్ ను పొగుడుతూ ఉంటాడు. సినిమాలు, రాజకీయాలపై కామెంట్లు చేసి వివాదానికి తెరలేపుతాడు. ఇక రామ్ గోపాల్ వర్మ 1962 ఏప్రిల్, 7న జన్మించాడు. విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో తన చదువును పూర్తి చేశాడు.

Advertisement

 

చదువు కన్నా చిత్రరంగం పైన ఎక్కువ శ్రద్ధ ఉండేది. సినిమాలపైన ఉన్న ప్రేమతో దర్శకుడు మరియు నిర్మాతగాను ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. హారర్ మరియు మాఫియా చిత్రాలను తీయడంలో ముందు వరుసలో ఉంటాడు. తాను తీసిన శివ, క్షణం క్షణం సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. ఆ రెండు ప్రేమ కథ చిత్రాలకు గాను నంది అవార్డులను కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయాడు. ఆర్జీవి రత్న అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

Advertisement

వీరికి అనే రేవతి వర్మ అనేపాప కూడా జన్మించింది. ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. దీంతో రత్న తన పాపను తీసుకుని వెళ్ళిపోయింది. ఇక రత్న తన పాపను చాలా కష్టపడి పెంచి ప్రణవ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. అతను అమెరికాలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. వారికి ఒక పాప కూడా జన్మించింది. ఇక ఆర్జీవి తన కూతురితో, మనవరాలితో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ, కలుస్తూ ఉంటాడట. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆర్జీవి.

ఇవి కూడా చదవండి

రానాకు కిడ్నీ సమస్య.. అసలు విషయం చెప్పిన దగ్గుబాటి హీరో

Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

టాలీవుడ్ హీరోస్ తీసుకున్న వరకట్నాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

Visitors Are Also Reading