సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా సినిమా టికెట్ల అంశంపై ఏపీ మంత్రి పేర్నినానితో సమావేశమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఏపీ సర్కార్ టికెట్ ధరల విషయంలో వెనక్కి తగ్గలేదు. దాంతో ఆర్జీవీ సైతం వెనక్కి తగ్గడం లేదు. ఏపీ సర్కార్ కు ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శిస్తున్నారు. ఓ వైపు ట్విట్టర్ లో మరో వైపు టీవీ ఇంటర్వ్యూలలో వర్మ తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తున్నారు. కాగా తాజాగా రామ్ గోపాల్ వర్మ ఇదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
సినిమా ఇండస్ట్రీ నుండి తను ఒక్కడే ప్రశ్నించడం వల్ల తనను చర్చలకు పిలిచారని అన్నారు. మిగతావాళ్లు ఎవరూ ప్రశ్నించక పోవడం వల్లే వాళ్లను పిలిచి మాట్లాడలేదని చెప్పారు. అదే విధంగా తనకు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు తన సినిమాకు సరిపోతాయని నాగార్జున చేసిన వ్యాఖ్యల పై కూడా ఆర్జీవీ స్పందించారు.
Advertisement
నాగార్జున సినిమా బడ్జెట్ చాలా తక్కువని అంతే కాకుండా ప్రస్తుతం సంక్రాంతి పండగ ఉండటం…ఆర్ఆర్ఆర్ రాధేశ్యామ్ సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో తన సినిమా బడ్జెట్ కు ప్రస్తుతం ఉన్న ధరలు సరిపోతాయనేదే ఆయన ఉద్దేశ్యమని చెప్పారు. అంతే కానీ నాగార్జున ఇండస్ట్రీకి వెన్నుపోటు పొడిచారని తాను అనుకోవడం లేదని వర్మ వ్యాఖ్యానించారు.
ఒక్కొక్కరికీ ఒక్కో పర్స్పెక్టివ్ ఉంటుందని అన్నారు. చిరంజీవి జంటిల్ మ్యాన్ అని ఆయన ఎవరినీ హర్ట్ చేయరని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా ఉంటే టికెట్ ధరలు పెంచుతారని అనుకోవడం…లేదంటే పెంచరని అనుకోవడం కేవలం అన్నీ మన ఊహలు మాత్రమేనని చెప్పారు.
also read : మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్….ఆచార్య రిలీజ్ వాయిదా..!