ఏపీలో సినిమా టికెట్ల ఇష్యూపై ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరుగా అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ టికెట్లు పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. వర్మ ఎప్పుడూ టిడిపి, జనసేన పై సెటైర్లు వేస్తూ ఉంటారు. అలాంటి వర్మ వైసీపీ ప్రభుత్వం ను ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ…. ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తూ కంపెనీలకు ప్రభుత్వ భూములను కేటాయించడం లాంటివి చేస్తుందని… అంతేకాకుండా ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలను కూడా అందిస్తుందని అన్నారు.
దాని ద్వారా ఉద్యోగుల శాతాన్ని పెంపొందించడం లాంటి కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. అయితే ఇలాంటిదే సినిమా థియేటర్స్ లో ఎందుకు లేదో తనకు అర్థం కావడం లేదని అన్నారు. థియేటర్స్ రేట్లపై ఆంక్షలు లేకపోతే ఒక పర్సన్ సినిమా తీస్తాడు అని ఇష్టమైన రేట్లు పెట్టుకుంటాడు అని అన్నాడు. నచ్చినోడు చూస్తాడు లేనోడు మానేస్తాడు అని వర్మ అన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్స్ అవుతుంది. ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది అని ప్రశ్నించాడు. ఒక హోటల్లో ఇడ్లీని పదికి అమ్మితే మరొకడు 100కు నమ్ముతాడు. నచ్చినోడు తింటాడు నచ్చనోడు వెళ్ళిపోతాడు. అదే విధంగా ఒక షర్ట్ ను ఒక దగ్గర 500కు అమ్మితే మరో షర్ట్ ధర 5 వేలు ఉంటుంది. మరోచోట 50వేల వరకు కూడా షర్ట్స్ వుంటాయి. దాని పై ప్రభుత్వానికి టాక్స్ అందుతుంది. వాడి స్తోమత మరియు కంఫర్ట్ ను బట్టి షర్ట్ కొనుక్కుంటాడు. కానీ 50,000 షర్ట్ ను ఐదువేలకు అమ్మాలి అంటూ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావడం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
Advertisement
Advertisement
ఒక్క సినిమా టికెట్స్ పైననే ఎందుకు ఇలా ఫిక్స్డ్ రేట్లు పెడుతున్నారు అని ప్రశ్నించారు. అన్ని వస్తువుల పైనా ఫిక్స్డ్ రేట్లు పెట్టాలి కదా అని ప్రశ్నించారు. ఇడ్లీ ల మీద చీరల మీద కూడా ఫిక్స్డ్ ధరలు పెట్టాలి అని అన్నారు. సినిమా తీయడానికి ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇచ్చిందా…? థియేటర్లు కట్టేందుకు ప్రభుత్వం ఏమైనా లోన్లు ఇచ్చిందా అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ హీరో నాని కూడా రీసెంట్ గా ఏపీలో థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా కొట్టు వారు ఎక్కువ సంపాదిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పలువురు మంత్రులు ఆయన పై ఫైర్ అయ్యారు. మరి ఆర్జీవి పై ఏపీ ప్రభుత్వం రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.