Home » విద్యార్ధి దశ నుంచే పాలిటిక్స్ ! సీఎం రేవంత్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?

విద్యార్ధి దశ నుంచే పాలిటిక్స్ ! సీఎం రేవంత్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?

by Sravya
Ad

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్తావనం గురించి చాలా మందికే తెలియదు. విద్యార్థి రాజకీయాల స్థాయి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా క్రమక్రమంగా రేవంత్ రెడ్డి వచ్చారు. రేవంత్ రెడ్డి కి ఏడుగురు అన్నదమ్ములు. ఒక చెల్లెలు. రేవంత్ రెడ్డికి ఉన్నారు రేవంత్ రెడ్డి స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డి పాలెం చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు బాగా ఉండేవి. రేవంత్ రెడ్డి బాల్యం పాఠశాల విద్య వరకు సొంత ఊరు దగ్గర ప్రభుత్వ పాఠశాలలో జరిగాయి. ఈ పాఠశాల స్థాయి నుండి నాయకత్వ లక్షణాలు ఉండడంతో ఈ స్థాయికి చేరుకున్నారు.

Advertisement

Advertisement

ఇంటర్మీడియట్ విద్యను ఒక ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశారు అప్పటినుండి కూడా రాజకీయాల మీద ఆసక్తి ఉండేదట. తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్ కి రావడంతో ఆయన లైఫ్ అంతా కూడా మారిపోయింది. రాజకీయంగా కీలక దశలోకి అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని ఏవీ కాలేజీలో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలో రేవంత్ రెడ్డి ఏబీవీపీ లో క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది.

తర్వాత ఆయన విద్యార్థి రాజకీయాలు లోకి అడుగు పెట్టారు. విద్యార్థినేతగా సమస్యల్ని పరిష్కరించేవారు. తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. టీఎస్ఆర్ఎస్ లో చేరి 2004లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా కూడా రాలేదు 2006లో జడ్పిటిసి గా ఎన్నికయ్యారు 2009లో కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచారు. ఇలా జడ్పిటిసిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎదిగి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading