ప్రతీ ఇంట్ల వంట నూనెలు వాడటం చాలా కామన్. వంట నూనెలు లేకుండా, అస్సలు కూదరదు. ఎంత రేటు పెరిగినా.. మనం ఆయిల్ వాడుతూనే ఉంటాం. అయితే, చాలా ఇళ్లలో వంట నూనెను రెండోసారి వాడే ప్రయత్నం చేస్తారు. పూరీలు లేదా ఏవైనా తిండి పదార్థాలు వేయించిన తర్వాత ఆయిల్ మిగిలిపోతే దాన్ని కూరలో వాడేందుకు ప్రయత్నిస్తారు.
Advertisement
ఈ పద్ధతి సురక్షితమా? ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందా? అసలు ఒకసారి ఉపయోగించిన నూనె మళ్ళీ వేయించడానికి అదే నూనేను ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? అయితే, మరి ఒకసారి ఉపయోగించిన నూనెని మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బులు:
ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వలన హృదయ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి పదేపదే మళ్లీ ఏ నూనెను ఉపయోగించకండి.
Advertisement
ఉదరకోశ సమస్యలు:
ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం వలన ఉదరకోశ సమస్యలు కూడా వస్తాయి.
అన్నవాహిక క్యాన్సర్లు:
మళ్లీ మళ్లీ అదే నూనెని ఉపయోగించడం వలన అన్నవాహిక క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
చెడు కొలెస్ట్రాల్:
పైగా ఒకసారి నూనెను ఉపయోగించినట్లయితే అందులోని పోషక పదార్థాలు మొత్తం మనం తీసుకుంటాము. నూనెను మళ్ళీ వేడి చేస్తే నూనె చెడు కొలస్ట్రాల్ కింద మారిపోతుంది. దీనితో గుండె సమస్యలు ముప్పు పెరుగుతుంది.
పాయిజన్ గా మారుతుంది:
ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం వలన అది ఫుడ్ పాయిజన్ కింద మారుతుంది. ఇలా కడుపులో నొప్పి, కడుపులో మంట వంటివి కలుగుతాయి. కాబట్టి అనవసరంగా ఇటువంటి తప్పులు చేసుకుని అనారోగ్య సమస్యలు భారిన పడకండి.
READ ALSO : గుజరాత్ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా విజయం