Home » ఆకాశంలో మెరుపుల‌కు కార‌ణ‌మేంటి..అంత పెద్ద శ‌బ్దాలు ఎందుకు వ‌స్తాయి..!

ఆకాశంలో మెరుపుల‌కు కార‌ణ‌మేంటి..అంత పెద్ద శ‌బ్దాలు ఎందుకు వ‌స్తాయి..!

by AJAY
Published: Last Updated on
Ad

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే ఎక్క‌వ‌గా ఆకాశంలో ఉరుములు మెరుపులు వ‌స్తుంటాయి. అలాగే పెద్ద పెద్ద గాలులు వీచిన‌ప్పుడు కూడా ఉరుములు మెరుపులు క‌నిపిస్తుంటాయి. ఇలా ఉరుములు మెరుపులు రావ‌డానికి కార‌ణం ఏంటో తెలుసుకుందాం…మేగాల పై భాగంలో ఊష్ణోగ్ర‌త‌లు అతి త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల నీటి ఆవిరి మంచు స్ప‌టికాలుగా మారుతాయి. అయితే మేగంలో ఉన్న మంచు స్ప‌టికాలు ఎటు ప‌డితే అటు క‌ద‌ల‌టం వ‌ల్ల అవి ఒక‌దానిని ఒక‌టి ఢీ కొంటాయి. అలా ఢీ కొన‌డం వ‌ల్ల మేగాల్లో విద్యుత్ ఛార్జ్ ఏర్ప‌డుతుంది. మేగంలోని విద్యుత్ చార్జిలో పాజిటివ్ తేలికగా ఉండి పై భాగానికి చేరుతుంది. అదే విధంగా నెగిటివ్ ఛార్జ్ అనే బ‌రువుగా ఉండ‌టం వ‌ల్ల అది అడుగు భాగానికి చేరుతుంది.

Advertisement

Advertisement

అయ‌స్కాంతం లోని వ్య‌తిరేక దృవాలు ఏ విధంగా ఆక‌ర్షించుకుంటాయో అదే విధంగా వ్య‌తిరేక అవేశాలు కూడా ఆక‌ర్షించుకుంటాయి. అలా ఆక‌ర్షించుకున్న స‌మ‌యంలో రెండు మేగాలు వేగంగా ఢీ కొంటాయి. అలా ఢీ కొట్ట‌డం వ‌ల్లే మెరుపులు ఏర్ప‌డ‌తాయి. ఇక మెరుపులు ఏర్ప‌డిప్పుడు ఆ మెరుపుచుట్టూ సుమారు 20730 డిగ్రీల సెల్సియస్ టెంప‌రేచ‌ర్ అనేది క్రియేట్ అవుతోంది. సూర్యుడి ఉప‌రితం ద‌గ్గర 5,500 డిగ్రీల సెల్సియ‌స్ ఊష్ణోగ్ర‌త మాత్ర‌మే ఉంటుంది. అంటే సూర్యుడి ద‌గ్గ‌ర ఉండే ఉష్ణోగ్ర‌త‌కు సుమారు ఐదు రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంద‌న్న మాట‌.

అంత విప‌రీత‌మైన వేడి ఒక్క‌సారిగా గాలిగుండా ప్ర‌యాణించిన‌ప్పుడు ఆ మెరుపు ప‌క్క‌న ఉన్న గాలి లోని క‌ణాలు ఒక్క‌సారిగా వేడెక్కి దూరంగా వ్యాపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాయి. ఆ స‌మ‌యంలో వాటి ప‌క్క‌నే ఉన్న క‌ణాల‌ను వేగంగా ఢీ కొట్ట‌డం వ‌ల్లే ఒక్క సారిగా భారీ శ‌బ్దాలు వినిపిస్తాయి. ఇదిలా ఉంటే లైట్ వ‌చ్చిన కాసేప‌టికి శ‌బ్దం ఎందుకు వ‌స్తుందా అని కూడా మీకు అనుమానం రావ‌చ్చు. కాంతి వేగం ధ్వ‌ని వేగం కంటే ఎక్కువ కాబ‌ట్టి ముందుగా మెరుపులు క‌నిపించి ఆ త‌ర‌వాత శ‌బ్దాలు వినిపిస్తాయి.

Visitors Are Also Reading