పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన భార్య రేణు దేశాయ్ తో 2012 లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తరవాత రేణు దేశాయ్ పవన్ కూడా దూరంగా పిల్లలతో కలిసి పూణే లో ఉంటోంది. విడాకుల తర్వాత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. నిహారిక పెళ్లికి వీరి పిల్లలు అకీరా నందన్, ఆద్య హాజరయ్యారు. కానీ రేణు దేశాయ్ మాత్రం ఆ పెళ్ళికి వెళ్లినట్టు కనిపించలేదు.
Advertisement
ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కలిసి ఒక ఫోటో దిగారు ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల తనయుడు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే జరిగింది. ఈ గ్రాడ్యుయేషన్ డే కి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ లు జంటగా హాజరయ్యారు. అంతే కాకుండా ఆద్య కూడా హాజరయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Advertisement
ఈ ఫోటోకు పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ మ్యూజిక్ ను జోడించి ఎమోషనల్ పోస్ట్ రాశారు. ఒక యుగం పూర్తయ్యిందని మరోయుగం మొదలవుతుంది అంటూ అకీరా స్కూల్ పూర్తయిందని రేణు దేశాయ్ పేర్కొన్నారు. తమ కొడుకు పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటి నుండి స్కూల్ బస్ కోసం తొందర పడే బాధ లేదు.
సమయానికి టిఫిన్ సిద్దం చేయాల్సిన అవసరం లేదు. ట్యూషన్ లేదు అసలు స్కూల్ ఏ లేదు. ఇప్పుడే నీ అసలైన జర్నీ మొదలైంది అని అకీరా కు నేను చెప్పాను. నాకు నమ్మకం ఉంది అకీరా అతడి దారిని వెతుక్కుంటాడు. మా అవసరం లేకుండానే అకీరా తన దారిని వెతుక్కుంటాడు అంటూ రేణు దేశాయ్ తన పోస్ట్ లో పేర్కొంది. అయితే రేణు దేశాయ్ ఈ ఫోటో కు కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేసింది.