Home » పవన్ కోసం రేణు ఇంత పెద్ద మూవీ ని మిస్ చేసుకున్నారా..?

పవన్ కోసం రేణు ఇంత పెద్ద మూవీ ని మిస్ చేసుకున్నారా..?

by Sravya
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అందరికీ సుపరిచితమే. పూణే లో గుజరాతీ కుటుంబంలో పుట్టారు రేణు. సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన రేణు దేశాయ్ 2000లో నటిగా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పార్వతీభన్ జేమ్స్ పాండు సినిమాలో హీరోయిన్గా నటించారు. పూరి బద్రి సినిమా కోసం హీరోయిన్స్ ని చూడడం మొదలుపెట్టారు ఇద్దరు హీరోయిన్స్ కావాలి.

renudesai-marriage

Advertisement

అమీషా పటేల్ ని ఒక హీరోయిన్ గ రేణు దేశాయ్ ని మరొకరిగా ఎంచుకున్నారు. బద్రి సినిమా షూటింగ్ కూడా మొదలైంది. పవన్ కళ్యాణ్ తో ఈ మూవీ షూటింగ్లో ఉండగానే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అలా వాళ్ళిద్దరి మధ్య సహజీవనం కూడా మొదలైంది 2000 లోనే మూవీ కూడా విడుదలైంది. తర్వాత వీళ్ళిద్దరి మధ్య పెళ్లి కాకుండానే రిలేషన్షిప్ ఏర్పడిందని టాలీవుడ్ లో అందరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తెలుగులో నటించిన మొదటి మూవీతో ఆమె కెరియర్ పూర్తిగా ఎండ్ అయిపోయింది.

Advertisement

mahesh-and-renudesai Movies

mahesh-and-renudesai Movies

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని ప్రేమించిందో అప్పుడే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది కేవలం ఎవరితోనో ప్రేమలో ఉందన్న కారణంతో సినిమాల్లో కూడా ఆమె నటించలేదు. 2003లో జానీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మారారు. హీరోయిన్ గా రేణు దేశాయ్ నటించారు అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే నటించారు. నిజానికి ఆమె తలుచుకుంటే అప్పట్లో అనేక సినిమాల్లో నటించేది బద్రి మూవీ పూర్తవుగానే ఆమెకి మురారి సినిమాలో సోనాలి బింద్రే పాత్రలో నటించే అవకాశం వచ్చింది. స్క్రిప్ట్ కూడా బాగా నచ్చింది ఈ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో ఉన్న కారణంగా ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆమె పక్కన పెట్టేసింది. తన భర్త తప్ప ఇంకో ప్రపంచం అక్కర్లేదని అనుకుంది ఇలా మురారి మూవీ లో నటించే అవకాశాన్ని కోల్పోయింది రేణు దేశాయ్.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading