Home » రక్తదానం దానం చేసిన అఖీరా… రేణూ దేశాయ్ ఎమోషనల్…!

రక్తదానం దానం చేసిన అఖీరా… రేణూ దేశాయ్ ఎమోషనల్…!

by AJAY
Ad

ర‌క్త‌దానం చేయ‌డం ఎంత గొప్ప విష‌య‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఇత‌రుల ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చు. ఆప‌ద‌లో ఉన్న ఓ కుటుంబాన్నే ఆదుకోవ‌చ్చు. అయితే చాలా మంది ర‌క్త‌దానం చేయ‌డానికి భ‌య‌ప‌డుతూ ఉంటారు కానీ 18 ఏళ్లు నిండి 50 కేజీల కంటే ఎక్కువ బ‌రువు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ర‌క్త‌దానం చేయ‌వ‌చ్చు. ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ర‌క్తం ఇచ్చిన వ్య‌క్తిలో కొత్త ర‌క్తం ఉత్ప‌త్తి జరిగి మ‌రింత ఆరోగ్యంగా త‌యార‌వుతారు.

Advertisement

ఇదిలా ఉంటే సెల‌బ్రెటీలు ర‌క్త దానం చేయ‌డం వ‌ల్ల వారిని ఆద‌ర్శంగా తీసుకుని సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా ర‌క్త‌దానం చేసేందుకు ముందుకు వ‌స్తుంటారు. తాజాగా ప‌వ‌ర్ స్టార్ కుమారుడు అఖీరా నంద‌న్ కూడా రక్తదానం చేశారు. అఖీరా ఇటీవ‌లే 18వ ఏట అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయ‌న ర‌క్త‌దానం చేసిన ఫోటోను రేణూదేశాయ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

అంతే కాకుండా ఈ ఫోటోకు సుధీర్ఘ‌మైన పోస్ట్ ను జోడించింది. ర‌క్తదానం చేయ‌డం వ‌ల్ల ఇత‌రులు ప్రాణాలు కాపాడ‌వ‌చ్చని పేర్కింది. ర‌క్త‌దానం ఒక్క‌టే ఇత‌రుల ప్రాణాల‌ను సైతం కాపాడ‌గ‌ల‌ద‌ని పేర్కొంది. 18 ఏళ్లు నిండిన త‌ర‌వాత రక్తం ఇస్తున్నాడు. పద్దెనిమిదేళ్లు నిండిన త‌ర‌వాత ర‌క్త దానం చేయండి అంటూ రేణూదేశాయ్ పేర్కొంది. ఇక అఖీరా నంద‌న్ ర‌క్త దానం చేయ‌డంపై ప‌వ‌న్ అభిమానులు కుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండ‌గా అఖీరా నంద‌న్ ఇటీవ‌ల మార్ష‌లార్ట్స్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే వీడియో చూసిన నెటిజ‌న్లు అఖీరా త్వర‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడ‌ని భావించారు. కానీ రేణూదేశాయ్ మాత్రం అఖీరా నంద‌న్ సినిమాల‌లోకి రావ‌డం లేద‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ని చెప్పింది.

AlSO READ :

పూర్తిగా మారిపోయిన‌ నాగ‌బాబు…అందుకోస‌మేనా..?

“స్వాతిముత్యం”లో క‌మ‌ల్ హాస‌న్ భార్య‌ దీప ఇప్పుడు ఎక్క‌డ ఉందో… ఏం చేస్తుందో తెలుసా..!

Visitors Are Also Reading