రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ తో ప్రేమ, పెళ్లి తర్వాత రేణుదేశాయ్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇక దాదాపు 20 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక రేణు దేశాయ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఓ మంచి పాత్రతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో రేణు దేశాయ్ చాలా బిజీగా ఉన్నారు.
Advertisement
ఇక రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తన రెండో పెళ్లిపై స్పందించారు. ఇక విడాకుల అనంతరం తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ సంతోషంగా సమయాన్ని గడుపుతున్న ఆమె 2018లో మరొక వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారట. ఇక ఎంగేజ్మెంట్ చేసుకుందని తెలిసి చాలామంది నుంచి ఆమెకు బెదిరింపులు వచ్చాయట. ఇక రేణు దేశాయ్ ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత తాను తెలుసుకున్నది ఏమిటంటే…. నా ఎంగేజ్మెంట్ సమయంలో నా కూతురికి ఏడు ఏళ్లు. ఇప్పటికే నా పిల్లలు తండ్రికి దూరంగా ఉంటున్నారు.
Advertisement
నేను మరో వ్యక్తిని వివాహం చేసుకుంటే నా సమయాన్ని తనతోనే గడపాల్సి వస్తుంది. ఇక నా పిల్లలతో సమయాన్ని నేను గడపలేకపోవచ్చు. వేరే వ్యక్తిని వివాహం చేసుకుంటే నా పిల్లలకి పూర్తిగా దూరం అవుతానని అనుకున్నాను. ఇక అందుకే ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నాను. పిల్లల గురించి చాలా బాధగా అనిపించింది. అందుకే నా కూతురు ఆధ్య కోసం వివాహం చేసుకోలేదు. నేను చేసింది తప్పో కాదో తెలియదు కానీ నేను అలా చేయాల్సి వచ్చింది. కానీ ఆధ్య కాలేజీకి వెళ్లే సమయంలో అప్పుడు నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. నా కొడుకు కూడా నీకు ఎవరైనా నచ్చితే ఆ వ్యక్తితో నువ్వు సంతోషంగా ఉంటావని అనుకుంటే పెళ్లి చేసుకో అమ్మ అని చెబుతూ ఉంటాడు అంటూ షాకింగ్ కామెంట్స్ వెల్లడించారు. ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- Mega family : లావణ్య తర్వాత మెగా ఇంటికి మరో హీరోయిన్ కోడలు కాబోతోందా..?
- చంద్రబాబు అరెస్ట్ వెనుక వాళ్లే ఉన్నారు… హైదరాబాద్ లో ధర్నా చేసుకోండి కానీ ఒక షరతు ! – మంత్రి కేటీఆర్..!!
- హీరో తొడలపై కూర్చోమన్నారు…ఎంగిలి ఐస్ క్రీమ్ తినమన్నారు – సుహాసిని