Home » సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో తమ రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చిన స్టార్స్ వీరే..!

సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో తమ రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చిన స్టార్స్ వీరే..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో ఏ నటీనటులకు ఉన్న డిమాండ్ ప్రకారం ఆ నటీనటులకు రెమ్యూనరేషన్లు ఇస్తూ ఉంటారు. అలాగే కొన్ని సినిమాలకు డేట్లను ఎక్కువగా కేటాయించిన సందర్భంలో నటీనటులకు వారికి ఉన్న డిమాండ్ కంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వవలసిన సందర్భాలు ఏర్పడతాయి. అలా భారీ రెమ్యూనరేషన్ లతో సినిమా రూపొంది మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా కనుక ఫ్లాప్ అయినట్లు అయితే ఆ మూవీలకు తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా నిర్మాతకు భారీ నష్టాలు వచ్చిన సందర్భంలో కొంతమంది నటీనటులు వారి రెమ్యూనిరేషన్ వెనక్కు ఇస్తుంటారు. అలా తమ రెమ్యూనిరేషన్ను వెనక్కు ఇచ్చిన కొంతమంది స్టార్ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ : ఈ నటుడు తాను నటించిన ఎన్నో సినిమాలకు నష్టాలు వచ్చిన సందర్భంలో తన రెమ్యూనిరేషన్ ను వెనక్కు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

రజనీకాంత్ : బాబా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ కావడంతో ఈ మూవీ ద్వారా నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయట. దానితో తన రెమ్యూనిరేషన్ లో చాలా బాగాన్ని రజనీకాంత్ నిర్మాతకు వెనక్కు ఇచ్చేసాడంట.

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన జానీ , కొమరం పులి మూవీలకు భారీ నష్టాలు వచ్చాయి. దానితో ఈ హీరో తన రెమ్యూనరేషన్ లో చాలా బాగానే నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారు.

బాలకృష్ణ : బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రేక్షకులను బాగానే అలరించినప్పటికీ ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల ఈ మూవీ నిర్మాతకు కాస్త నష్టాలు రావడంతో తన రెమ్యూనరేషన్ లో చాలా భాగాన్ని బాలకృష్ణ నిర్మాతకు వెనక్కు ఇచ్చేశాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు : ఈ హీరో నటించిన ఖలేజా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ రిజల్ట్ తెచ్చుకోకపోవడంతో ఈ మూవీ ద్వారా నిర్మాతలకు చాలా మొత్తంలో నష్టం వచ్చిందట. దానితో మహేష్ తన రెమ్యూనిరేషన్ లో చాలా భాగాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాడు.

 

వీరితోపాటు మరికొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సినిమాలకు నష్టాలు వచ్చిన సందర్భంలో తమ రెమ్యూనిరేషన్లను వెనక్కు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

Visitors Are Also Reading