Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » జియో బంపర్ ఆఫర్.. రూపాయికే 100 MB డాటా

జియో బంపర్ ఆఫర్.. రూపాయికే 100 MB డాటా

by Bunty
Ads

రిలయన్స్ జియో… వినియోగదారులకు అదిరిపోయే శుభ వార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయి మాత్రమే… 100 mb ఇస్తున్నట్లు ప్రకటించి కస్టమర్లలో ఆనందం నింపింది జియో. రీసెంట్ గా టెలికాం నెట్వర్క్ అన్ని… టారిఫ్ లు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో ఒ ఒక్క రూపాయికి ఇంటర్నెట్ ప్యాకేజీ అందించడం సంచలనంగా మారింది.

Advertisement

Ad

Advertisement

ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్ ను అందించిన ఘనత రిలయన్స్ జియో కు మాత్రమే దక్కింది. అలాగే దీని వ్యాలిడిటీ కూడా 30 రోజులు ఉంటుందని స్పష్టం చేసింది రిలయన్స్. ఈ డేటా అయిపోగానే 64kbps తో ఇంటర్నెట్ స్పీడ్ అందుతుంది. అంటే వాట్సాప్ లో సాధారణంగా మనం టెక్స్ట్ మెసేజ్ లు పెట్టుకునే అంత డేటా సరిపోతుంది. ఇక ఈ ఆఫర్ ప్రకటించడంతో.. జియో సిమ్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే జియో… తన రీఛార్జి ప్లాన్స్ రేట్లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading