వినియోగదారులకు రిలయన్స్ జియో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించిన రిలయన్స్ జియో… తాజాగా డిస్నీ + హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా భారీగా పెంచేసింది రిలయన్స్ జియో. గతంలో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్రారంభమయ్యే ఈ ప్లాన్లు ఇకపై… 601 రూపాయికి నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే వినియోగదారులపై దాదాపు 20శాతం అదనంగా భారం పడనుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది సబ్స్క్రిప్షన్, 3జీబి హై స్పీడ్ డేటా తో పాటు 28 రోజుల కలిగిన ధరను జిఓ 601 రూపాయలకు పెంచేసింది.
Advertisement
Ad
గతంలో ఈ ప్లాన్… ధర 499 ఉండేది. ఈ ప్యాక్ లో సి హై స్పీడ్ డేటా ని అదనంగా అందిస్తోంది జియో. దీంతోపాటు అన్లిమిటెడ్ కాల్స్… ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు ఫ్రీగా లభిస్తాయి. అలాగే గతంలో 666 రూపాయలకు లభించే… ప్లాన్ ధరను 799 రూపాయలకు చేశారు. ఈ ప్లాన్ లో డిస్నీ + హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ తో పాటు 50 రోజుల వ్యాలిడిటీ అలాగే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.
Advertisement
ఇదే తరహాలో 84 రోజులు వ్యాలిడిటీ కలిగిన… రూ.888 ప్లాను 1066 రూపాయలకు పెంచారు. అలాగే 365 రోజులు వ్యాలిడిటీ తో వస్తున్న…రూ.2599 ప్లాన్ ధరను రూ.3119 కు వివరించారు. 1.5 జీవి రోజువారి డేటాతో 56 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ ధరను 549 రూపాయల నుంచి 659 కి వినియోగదారులకు షాక్ ఇచ్చింది జియో.