నందమూరి ఫ్యామిలీ ఉండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న హీరో ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటన డ్యాన్స్ చూసి మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవుతారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆ అంచనాలను మించేలా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ లో అందరు హీరోల పై వచ్చిన వార్తల్లాగే ఎన్టీఆర్ పై కూడా అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.
ALSO READ : ఉదయ్ కిరణ్ నరేష్ తో మాట్లాడిన చివరి మాటలు ఇవే…!
Advertisement
ఎన్టీఆర్ ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని అంతే కాకుండా హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడని కూడా వార్తలు వినిపించాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు..ఎన్టీఆర్ కు జోడీగా అశోక్, నరసింహుడు లాంటి సినిమాలు చేసింది. సమీరా రెడ్డి కూడా తెలుగమ్మాయి కాగా ఎన్టీఆర్ తో ఈ భామ ప్రేమలో ఉందంటూ అప్పట్లో వార్తలు జోరుగా వినిపించేవి. అంతే కాకుండా ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని…..సమీరా రెడ్డి నందమూరి ఫ్యామిలీకి కొడలు అయ్యేందుకు ఎన్టీఆర్ ను బుట్టలో వేసిందని కూడా కథనాలు వచ్చాయి.
Advertisement
అయితే వీరిద్దరూ మాత్రం ఆ వార్తలను తిప్పికొట్టారు. తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ఈ వార్తలు రావడానికి కూడా కొన్నికారణాలు ఉన్నాయి. సమీరా రెడ్డి తెలుగు అమ్మాయి కావడం ఒక కారణం అయితే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో కాస్త క్లోజ్ గా ఉండటం కూడా మరో కారణం. ఇదిలా ఉంటే సమీరా అప్పటికే పలు బాలీవుడ్ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో ఎన్టీఆర్ చిరంజీవి సరసన సినిమాలు చేసింది. ఇక చివరగా సమీరా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమాలో నటించింది. ఆ తరవాత అక్షయ్ వర్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ కూడా తమ బంధువు లక్ష్మీప్రణతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.