పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. వరుడు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. అంతే కానీ నమ్మించి గొంతుకోస్తారా..? గొంతుకోసే బధులు అదే విషయం అబ్బాయికి చెబితే సరిపోయేది కదా. గొంతుకోయడానికి వచ్చిన ధైర్యం పెళ్లి వద్దని చెప్పడానికి లేదా.? ఈ ప్రశ్నలన్నీ వినిపిస్తున్నది రాష్ట్రవ్యాప్తంగా కాదు కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అనకాపల్లి హత్యాయత్నం కేసు గురించే. పూర్తివివరాల్లోకి వెళితే….నిన్న అనకాపల్లి జిల్లా రావి మంతలం మండలంలో దారుణం చోటు చేసుకుంది.
Advertisement
పుష్ప అనే యువతికి హైదరబాద్ లో సీఎస్ఐఆర్ లో సైంటిస్ట్ గా పనిచేస్తున్న రామానాయుడితో పెళ్లి సెట్ అయ్యింది. వచ్చే నెలలో వీరికి వివాహం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో రామానాయుడు విశాకపట్నానికి వచ్చాడు. పుష్ప తన కాబోయే భర్త రామానాయుడికి ఫోన్ చేసి ఓ గుడి దగ్గరకు రవాలని కేక్ కట్ చేయాలని కోరింది. దాంతో రామానాయుడు వెంటనే అక్కడకు చేరుకున్నాడు. నీకు ఓ సర్ప్రైజ్ కండ్లు మూసుకో అంటూ కండ్లకు గంతలు కట్టింది. దాంతో రామానాయుడు ఏదో ఊహించుకుని కండ్లకు గంతలు కట్టించుకున్నాడు.
Advertisement
తరవాత తన వెంట తెచ్చుకున్న కత్తితో పుష్ప రామానాయుడి గొంతుకోసింది. దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యిన రామానాయుడు కిందపడిపోయాడు. పుష్ప తనకు పెళ్లి ఇష్టం లేదని అందుకే ఇలా చేశానని చెప్పింది. వెంటనే రామానాయుడు అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి వెళ్లాడు. మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు. పుష్ప చేసిన పని దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఆమెపై ట్రోల్స్ వస్తున్నాయి.
కాగా ఈ ఘటనపై స్పందించిన తెలుగు హీరోయిన్ రేఖా బోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. “నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న” అని చెప్పే స్వేచ్ఛ ఆడపిల్లలకి తల్లదండ్రులు ఇవ్వనంత కాలం ఇలాంటివి ఇంకా చుడాల్సి వస్తుంది. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా రా అని అబ్బాయిలని అడిగినంత ఫ్రెండ్లీగా అమ్మాయిలని అడిగే పేరెంట్స్ ఎంత మంది వున్నారు…అదే జరిగితే ఇలాంటివి జరగవు. ఏ క్రిమినల్ బ్యాగ్రౌండ్ లేని ఒక మామూలు అమ్మాయి ఇలా చేసిందీ అంటే అది ఎవరి తప్పు. సమస్యని మూలాల నుంచి చూసే మెచ్యూరిటీ ఈ సొసైటీకి రావాలని కోరుకంటున్నా..అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.