Home » రూపాయి ప‌తనానికి కార‌ణాలు ఏంటి..?

రూపాయి ప‌తనానికి కార‌ణాలు ఏంటి..?

by AJAY
Ad

రూపాయి రోజు రోజుకు ప‌త‌నం అవుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు ప‌డిపోతుంది. గ‌త‌వారం డాల‌ర్ తో పోలిస్తే రూపాయి విలువ భారీగా ప‌డిపోయింది. ఒక డాల‌ర్ విలువ దాదాపుగా 76రూపాయ‌లుగా ఉంది. మ‌రోవైపు మార్చినాటికి డాల‌ర్ విలువ 77 నుండి 78 రూపాయల వ‌ర‌కూ చేరే అవ‌కాశం ఉంద‌ని విశ్లేకులు అభిప్రాయ ప‌డుతున్నారు. అయితే రూపాయి ప‌త‌నానికి ప‌ది కార‌ణాలు ఉన్నాయని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆ పది కార‌ణాలేంటో ఇప్పుడు చూద్దాం..

reasons for doller getting strong

reasons for doller getting strong

మ‌న‌దేశం ఎగుమతి చేసే వ‌స్తువులు దిగుమ‌తి చేసుకునే వ‌స్తువులు
మ‌న‌దేశం ఎగుమతి చేసే వ‌స్తువుల కంటే దిగుమ‌తి చేసుకునే వ‌స్తువులు పెరిగిన‌ట్ట‌యితే వాణిజ్య‌లోటు ఏర్ప‌డుతుంది. కాగా వ‌స్తుప‌ర‌మైన వాణిజ్య లోటు భార‌త్ లో ఉంది.

Advertisement

విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబ‌డులు
స్టాక్ మార్కెట్ లో విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబ‌డులు ఒక‌సారి వ‌స్తున్నాయి మ‌రోసారి పోతున్నాయి. అలా స్థిరంగా లేక‌పోవ‌డం కూడా రూపాయి విలువ ప‌డిపోయేందుకు కార‌ణం అవుతోంది.

Advertisement

స్థిర‌త్వం లేక‌పోవ‌డానికి కార‌ణం
స్టాక్ మార్కెట్ లో విదేశీ పెట్టుబ‌డులు పెట్ట‌క‌బోవ‌డానికి కార‌ణం ఏంటంటే కంపెనీ పై పెట్టుబ‌డి పెట్టిన దానికంటే లాభాలు రావ‌డం త‌క్కువ‌గా ఉండ‌టం.

అంత‌ర్జాతీయంగా ద్ర‌వ్యోల్భ‌నం పెరుగుతోంది.

ప్ర‌పంచ‌చ‌మురు మార్కెట్ లో ముడి చమురు ద‌ర‌లు పెరుగుతున్నాయి. మ‌నదేశం ఎక్కువ మొత్తంలో చ‌మురును దిగుమ‌తి చేసుకుంటుంది. చ‌మురు ధ‌ర‌లు పెరిగితే మ‌న దేశం ఎక్కువ మొత్తంలో వెచ్చించి చ‌మురును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాంతో రూపాయి విలువ ప‌త‌నం అవుతుంది.

అమెరికాలో వ‌డ్డీరేట్టు పెంచితే అక్క‌డే పెట్టుబ‌డులు పెడ‌తారు. మ‌న‌దేశంలో పెట్టుబ‌డులు పెట్టేకంటే అమెరికాలో ఎక్కువ లాభం వ‌స్తుందంటే అక్క‌డే పెడ‌తారు. అది కూడా రూపాయి విలువ ప‌త‌నానికి కార‌ణం అవుతోంది.

క‌రోనా విజృంభ‌ణ త‌ర‌వాత అమెరికాకు యూరప్ ప్ర‌భుత్వాలు పెద్ద ఎత్తున డాల‌ర్ల‌ను ప్రింట్ చేసి మార్కెలోకి పంపారు. దీనిని ఈజీ మ‌నీ అంటారు. దాంతో అమెరికాలో ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డటం కూడా ఒక కార‌ణం.

గ్లోబ‌ర్ అన్ స‌ర్టెనిటీ పెర‌గ‌టం కూడా డాల‌ర్ వాల్యూ పెర‌గ‌డానికి కార‌ణం అవుతోంది.

also read :ఫైబ‌ర్ సిలిండ‌ర్లు వ‌చ్చేశాయ్…వీటి ప్ర‌త్యేక‌త‌లు ఇవే..?

Visitors Are Also Reading