ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో అక్రమ సంబంధాలు కూడా ఒకటి. అక్రమ సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఈ సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు లాంటి దారుణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
Advertisement
అక్రమ సంబంధం వల్ల కేవలం ఒక కుటుంబం మాత్రమే కాకుండా ఇరువైపులా ఉన్న కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రతిరోజు వార్తల్లో అక్రమ సంబంధాల వల్ల జరిగిన దారుణాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే నిజానికి ఈ సంబంధాలకు కారణం ఏంటి అన్న విషయం ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసేవారు. దాంతో మరొకరి పైకి మనసు మళ్లే అవకాశం ఉండేది కాదు. దాంతో అక్రమసంబంధాలు తక్కువ కనిపించేవి.
ప్రస్తుత జీవితంలో తమ జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ఉండటం. ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్ వల్ల ఆఫీసు లోనే ఎక్కువ సమయం గడపడం దాంతో కుటుంబాన్ని పట్టించుకోకపోవడం. లాంటి కారణాల వల్ల కూడా ఈ సంబంధాలు పెరిగిపోతున్నాయి.
Advertisement
జీవితంలో వస్తున్న ఆర్థిక సమస్యలు కూడా కొన్నిసార్లు అక్రమ సంబంధాలకు కారణమవుతాయి. ఉన్నదానితో సంతృప్తి పడకుండా లేనిదాని కోసం పాకులాడే క్రమంలో ఇతరులు ఆశచూపితే లొంగిపోవడం వల్ల ఇలాంటి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది.
జీవిత భాగస్వామి లో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడటం. లేదా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండాలనే భావన భర్తలకు రావడం లాంటి వి కూడా అక్రమ సంబంధాలకు దారి తీస్తాయి.
ఇష్టం లేని పెళ్లిళ్లు చేయడం కూడా అక్రమ సంబంధాలకు కారణమవుతుంది. పెళ్లికి ముందే భర్త లేదా భార్య ఎవరితోనైనా ప్రేమలో ఉండటం లేదా పెళ్లయిన తర్వాత తమ జీవిత భాగస్వామి నచ్చక మరొకరికి ఆకర్శితులు అవ్వడం కూడా అక్రమ సంబంధాలకు దారి తీస్తోంది.
ALSO READ :
టీ తాగేటప్పుడు ఎట్టి పరిస్థితిలో వీటిని అస్సలు తీసుకోకూడదు జాగ్రత్త..!
హీరో వడ్డే నవీన్ సినిమాలు తీయకపోవడానికి కారణం ఎవరో తెలుసా..!!