ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమా తో 2000 సంవత్సరం లో ఉదయ్ కిరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను రామోజీరావు నిర్మించారు. కేవలం రూ.50 లక్షల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా ఏకంగా రూ.7 కోట్ల కలెక్షన్ లు రాబట్టింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడిగా రీమా సేన్ నటించి అలరించింది.
Advertisement
Also Read: ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…ఏం చేస్తుందంటే..!
ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఉదయ్ కిరణ్ మాత్రం ఓవర్ నైట్ స్టార్ అవ్వలేకపోయారు. ఆ తరవాత ఉదయ్ కిరణ్ నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో మరో రెండు హిట్లు అందుకున్నాడు. దాంతో స్టార్ డైరెక్టర్ లు ఉదయ్ కిరణ్ డేట్స్ కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత తో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ వెంటనే ఏకంగా 11 బడా బ్యానర్ లు ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.
Advertisement
అంతే కాకుండా పది బ్యానర్ లు సినిమాలు కూడా ప్రకటించాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ సుస్మిత ల వివాహం క్యాన్సిల్ అయ్యింది. పెళ్లి క్యాన్సిన్ అవ్వడానికి కారణం ఉదయ్ కిరణ్ బిహేవియర్ నచ్చకపోవడం వల్లనే క్యాన్సిల్ అయ్యిందని అప్పట్లో వార్తలు వినిపించేవి. ఇక ఆ తరవాత సుస్మితకు ఓ వ్యాపార వేత్తతో వివాహం జరిగింది. దాంతో ఉదయ్ కిరణ్ తో సినిమాలు ప్రకటించిన బడా బ్యానర్ లు అడ్వాన్స్ లను వెనక్కి తీసుకున్నాయి.
మెల్లి మెల్లిగా ఉదయ్ కిరణ్ కు ఆఫర్ లు తగ్గుముఖం పట్టాయి. కొన్ని సినిమాలు చేసినా అవి విజయం సాధించలేదు. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ నిషిత అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకున్నాడు. ఆ తరవాత ఉదయ్ కిరణ్ పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. చివరికి సినిమాలు లేక ఫ్యామిలీ లైఫ్ కూడా అనుకున్నట్టు లేకపోవడం తో చివరికి డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: ఉదయ్ కిరణ్ ఎం రత్నం సినిమా మధ్యలోనే నిలిచిపోవడం వెనుక అప్పటి పత్రికల్లో వచ్చిన కథనాలు..!