Home » నటి ఆర్తి అగర్వాల్ హఠాత్తుగా మరణించడానికి కారణం ఇదేనా..?

నటి ఆర్తి అగర్వాల్ హఠాత్తుగా మరణించడానికి కారణం ఇదేనా..?

by Sravanthi
Ad

నటి ఆర్తి అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఈమె జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు కూడా జరిగాయి అని అందరికీ తెలిసింది. ఈమె 31 ఏళ్లు వయసులోనే మరణించింది, దానికి కారణం హీరో తరుణ్ తో ప్రేమ వ్యవహారం వల్లనే అని ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. అయితే దానివల్ల డిప్రెషన్ కి వెళ్లి ఆస్పత్రి పాలు అయిందని ఇంకా అదే టాక్ నడుస్తూ వచ్చింది. ఈ విషయాల పై తరుణ్ తల్లి, సీనియర్ నటి రోజా రమణి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

tarun-and-aarthiagawal-love

Advertisement

ఆర్తి అగర్వాల్ హాస్పిటల్ లో చేరడానికి కారణం ఇది కాదని వేరే కారణం వల్ల అని సమాధానం ఇచ్చారు, అయితే ఇవన్ని కేవలం రూమర్స్ అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. తరుణ్ మరియు ఆర్తి అగర్వాల్ కేవలం రెండు సినిమాలు మాత్రమే కలిసి చేశారు కాకపోతే రూమర్స్ మాత్రం ఎక్కువగానే వచ్చాయి, అయితే శ్రేయ తరుణ్ కలిసి నాలుగు సినిమాలు చేశారు. శ్రేయ మరియు తరుణ్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు అని ఆమె చెప్పారు.

Advertisement

Also read:


నటి రోజా రమణి తరుణ్ మరియు ఆర్తి అగర్వాల్ క్లోజ్ గా, బయటకి అందరికీ తెలిసేలా ఎందుకు అని కొంచెం జాగ్రత్తగా ఉండమని వారిని హెచ్చరించింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి నటించలేదు మరియు ఆర్తి అగర్వాల్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కానీ హఠాత్తుగా చిన్న వయసులోనే ఆర్తి అగర్వాల్ మరణించడంతో చాలా బాధపడ్డామని ఆమె తెలిపారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading