రైలు ప్రయాణం చౌకైన ప్రయాణం… సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం. తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రయాణం కావడంతో ఎక్కువ మంది ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక రైలు బోగీల్లో మనకు అనేక అక్షరాలు కనిపిస్తుంటాయి. ఆ ప్రత్యేకమైన గుర్తులకు ప్రత్యేకమైన గుర్తులకు ప్రత్యేకతలు ఉంటాయి. అవేంటో చూద్దాం. రైలు బోగీ చివర ఎక్స్ అనే గుర్తు వేస్తుంటారు. ఆ గుర్తు ఎందుకు వేస్తారో తెలుసా?
Advertisement
Advertisement
బోగీ వెనక భాగంతో ఎక్స్ అనే పెద్ద సింబల్, దానికి దగ్గరగా ఎల్‌వీ అనే అక్షరాలు రాసుంటాయి. దీని అర్ధం అంటే లాస్ట్ వెహికిల్ అని అర్ధం అట. బోగీ చివర వెనుక భాగంలో చిన్న ఎల్లో కలర్ బోర్డుకూడా ఉంటుంది. ఇది రెండు వైపులా ఉంటుంది. ఎక్స్ అనే సింబల్ కింది భాగంలో ఒక రెడ్ లైట్ వెలుగుతుంటుంది.
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడేందుకు ఈ సింబల్ వేస్తారట. రాట్రిపూట బోగీ వెనకాల ఉండే ఎక్స్ సింబల్, దానికింద ఉండే రెడ్ లైట్‌ను బట్టి అలర్ట్ అవుతారు. రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ విధంగా సింబల్స్ వేస్తుంటారు.