టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైమ్ అస్సలు బాగోలేదు. గతేడాది డిసెంబర్ లో సమంత తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తరవాత సామ్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంది. యశోద లాంటి లేడీ ఓరియెండ్ చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేసింది. అంతే కాకుండా శాకుంతలం సినిమా షూటింగ్ కూడా దగ్గరపడుతోంది. అయితే రెండు నెలలుగా సామ్ సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండటంతో పాటూ షూటింగ్ లకు కూడా గ్యాప్ ఇచ్చింది.
Advertisement
దాంతో సమంత అనారోగ్యంతో బాధపడుతోందని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు నిజమేనని చెబుతూ సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నానని త్వరలోనే కోలుకుంటానని డాక్టర్ లు చెప్పారని సమంత పేర్కొంది. బెడ్ పై సెలైన్ పెట్టుకుని పడుకున్న ఫోటోను సైతం సమంత షేర్ చేసింది.
Advertisement
దాంతో సెలబ్రెటీలు, నెటిజన్లు , సమంత అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత అనారోగ్యం భారిన పడటంతో ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటి దానికి కారణాలు ఏంటి అని ఆరాతీయడం మొదలుపెట్టారు. అయితే సమంత అనారోగ్యానికి కారణం ఆమె విడాకుల తరవాత డిప్రెషన్ లోకి వెళ్లడమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చైతూతో విడాకుల తరవాత సమంత చాలాకాలం పాటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అయితే అది కూడా సామ్ అనారోగ్యానికి కారణం అయి ఉండవచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కోసం కఠినమైన వర్కౌట్ లు చేసింది. అలా వర్కౌట్ లు చేయడం కూడా