సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారిలో చాలామంది మల్టీ టాలెంటెడ్ ఉంటారు. అన్నగారు నందమూరి తారక రామారావు కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. ఎన్టీఆర్ కేవలం నటనతోనే కాకుండా దర్శకత్వం…. సినిమాలను నిర్మించడం…సాహిత్యం లో పట్టు ఉండటం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మంచి అభిరుచిని కలిగి ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ హీరో గానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యారు.
Advertisement
ఎన్టీఆర్ నిర్మించిన అనేక చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అదేవిధంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి. అయితే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ దర్శకుడిగా రాణించడం వెనకాల కొంతమంది ప్రోత్సాహం కూడా ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన సన్నిహితులకు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తోడుగా నిలిచేవారు.
Advertisement
ఇక ఎన్టీఆర్ నిర్మాతగా మారడానికి కి ఓ కారణం కూడా ఉంది. ఎన్టీరామారావు సోదరుడు త్రివిక్రమ్ రావు సంగీత పర్యవేక్షకుడిగా.. నిర్మాతగా పనిచేసేవారు. ఎన్టీఆర్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాను త్రివిక్రమ్ రావు నిర్మించారు అయితే ఈ సినిమాకు బడ్జెట్ సరిపోలేదట. దాంతో త్రివిక్రమ్ రావు అధిక వడ్డీకి వాహిని సంస్థ నుండి అప్పు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ సంస్థ అప్పు ఇవ్వమని… సహనిర్మాణ బాధ్యతలు తీసుకుంటామని చెప్పింది. అలా చేస్తే లాభాలలో వాటా ఇవ్వాల్సి వస్తుంది. దాంతో విక్రమ్ రావు అంగీకరించలేదు.
ఇక ఈ విషయం ఎన్టీఆర్ కు ఎలా చెప్పాలో తెలియక బాధపడుతుండగా ఎన్టీఆర్ కు అప్పటికే ఆ విషయం తెలిసిపోయింది. దాంతో ఎన్టీఆర్ వాహిని స్టూడియో వారితో మాట్లాడి డబ్బులు ఇచ్చేలా ఒప్పించారు. ఆ తర్వాత తమ్ముడు త్రివిక్రమ్ రావు ఏ సినిమా తీసినా నిర్మాతగా ఎన్టీఆర్ ఉండేవారు. కానీ నిర్మాతగా త్రివిక్రమ్ రావు పేరునే వేసుకునేవారు. వెనకాల ఉంది నడిపించింది మాత్రం త్రివిక్రమ్ రావు గారే. ఇక ఒకటి రెండు సినిమాలకు నిర్మాత గా ఎన్టీఆర్ పేరును కూడా వేసుకున్నారు.