టాలీవుడ్ లో ప్రస్తుతం కొంతమంది సెలబ్రెటీలు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సీనియర్ హీరోలు కూడా తమ భార్యలకు విడాకులు ఇచ్చారు. అలాంటి వారిలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఒకరు. కమల్ హాసన్ మొదట సారిక ఠాకూర్ ను వివాహం చేసుకున్నారు. వారికి శృతిహాసన్ మరియు అక్షరహాసన్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆ తరవాత కొన్ని కారణాల వల్ల కమల్ హాసన్ సారికకు విడాకులు ఇచ్చి నటి గౌతమిని పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి వైవాహిక జీవితం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. దాంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే అప్పట్లో గౌతమి, కమల్ హాసన్ విడాకులకు ఓ హీరోయిన్ కారణం అని హీరోయిన్ తో రిలేషన్ షిప్ వల్లనే గౌతమి కమల్ హాసన్ విడిపోయారని వార్తలు వచ్చాయి.
Advertisement
Advertisement
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి తమ విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ తో విడాకులకు హీరోయిన్ కారణమా అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఎవరు మధ్యలో వచ్చినా మనుషులు మారారని అందుకే విడిపోవాల్సి వచ్చిందని గౌతమి పేర్కొన్నారు. తమ దారులు వేరయ్యాయని ఇద్దరం డైవర్ట్ అయ్యామని తెలిపారు. విడాకుల వల్ల తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు.
తన కూతురు జీవితం కూడా విడాకుల వల్ల ఇబ్బందిగా మారిందని చెప్పారు. విడాకుల కారణంగా ముగ్గురు ఇబ్బంది పడ్డారని అందులో తనతో పాటూ తన కూతురు కూడా ఉన్నారని చెప్పారు. కమల్ హాసన్ తో విడాకులకు ఖచ్చితంగా హీరోయన్ మాత్రమే కారణం అని అసలు హీరోయిన్ ఉందో లేదో కూడా నేను మాట్లాడనని చెబుతూనే మనుషులు మారారు అంటూ గౌతమి వ్యాఖ్యానించారు.
also read : పిల్లలను ఎక్కువగా పొగుడుతున్నారా..? అయితే ఈ తిప్పలు తప్పవు..!