Home » దిల్ రాజు ఫ్రస్ట్రేషన్ కి అసలు కారణం అదేనా? ఆ ప్రొడక్షన్ హౌస్ పోటీకి వస్తోందా?

దిల్ రాజు ఫ్రస్ట్రేషన్ కి అసలు కారణం అదేనా? ఆ ప్రొడక్షన్ హౌస్ పోటీకి వస్తోందా?

by Srilakshmi Bharathi
Ad

సంక్రాంతి సినిమాలు సందడి చేస్తున్న వేళ.. ప్రముఖ సినిమా నిర్మాత దిల్ రాజు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. సినిమాల రిలీజ్ కి థియేటర్లు దొరకడం ఇబ్బంది అవుతున్న క్రమంలో దిల్ రాజే సమస్యని పరిష్కరించారని వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే.. సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో కీ రోల్ పోషించిన నిర్మాత దిల్ రాజు ఈగల్ సినిమా నిర్మాతలను సినిమా పోస్ట్ పోన్ చేయడానికి ఒప్పించారు. అయితే.. హనుమాన్ ని కూడా వాయిదా వేయాలని ఆ సినిమా యూనిట్ ని కోరారట. కానీ, వారు పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకోవడంతో పోస్ట్ పోన్ చేయడం సాధ్యం కాలేదు. ఇలా సర్ది చెప్పి సినిమా రిలీజ్ విషయంలో దిల్ రాజే సమస్యని పరిష్కరించారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మీడియా వెబ్ సైట్స్ ఆయన్ను విమర్శిస్తూ వార్తలు రాయడంతో దిల్ రాజ్ ఫైర్ అయ్యారు.

Advertisement

Dil Raju

ప్రతి సంక్రాంతికి ఎదో విధంగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఇకపై తనపై తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తా అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే.. దిల్ రాజు ఫ్రస్ట్రేషన్ కి అసలు కారణం వేరే ఉంది అంటూ తాజాగా మరో వార్తా వైరల్ అవుతోంది. మరో బడా ప్రొడక్షన్ హౌస్ ఆయనకి పోటీగా మారడమే అసలు కారణం అని తెలుస్తోంది. రీసెంట్ గానే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ని ప్రారంభించిన ఈ సంస్థ సలార్ సినిమాను కూడా రిలీజ్ చేసింది. హనుమాన్ సినిమాను కూడా వాళ్ళే రిలీజ్ చేస్తున్నారట. వరుసగా పెద్ద సినిమాలను తీసేసుకోవడంతో పాటు.. సింగల్ స్క్రీన్స్ ని కూడా తీసేసుకోవడంతో దిల్ రాజుకి పోటీగా మారుతున్నారట. ఈ క్రమంలో దిల్ రాజుకు థియేటర్స్ తగ్గిపోవడంతో ఆయన ఫ్రస్టేషన్‌కి గురవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు నైజాం లో దిల్ రాజుకు అడ్డు లేదు. కానీ, ఇప్పుడు ఈ బడా సంస్థ దిల్ రాజుకు పోటీగా వచ్చి ఆయన బిజినెస్ లను దెబ్బ కొట్టడంతో ఆయన ఫ్రస్ట్రేషన్ కి గురి అవుతున్నారు అనేది ఈ వార్తల సారాంశం.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading