అలనాటి డైరెక్టర్లలో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందిన డైరెక్టర్ కోడి రామకృష్ణ. 130కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి చరిత్ర సృష్టించారు. తెలుగు,తమిళం,మలయాళం, కన్నడ,హిందీ, భాషల్లో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ఆయన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ చిత్రం సూపర్ హిట్. ఇక దీంతో ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎలాంటి సినిమా అయినా తెరకెక్కించడంలో కోడి రామకృష్ణ దిట్ట. ఓ పక్క కుటుంబ నేపథ్యం చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే, మరోపక్క రాజకీయ చిత్రాలు, సామాజిక స్పృహ కల్పించే చిత్రాలకు కూడా దర్శకుడిగా చేశారు.
Advertisement
also read:పవన్ కొత్త లుక్ లో బలే ఉన్నాడుగా..!
గ్రాఫిక్స్ లో కూడా భారీ చిత్రాలు తీసి సాటిలేని డైరెక్టర్ అనిపించుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో ఆయన సినిమాలు చేసి వారికి స్టార్డం వచ్చేలా చేయడంలో ముఖ్య పాత్ర వహించారని చెప్పవచ్చు. కోడి రామకృష్ణ స్వస్థలం పాలకొల్లు. తల్లిదండ్రులు చిట్టెమ్మ నరసింహమూర్తి. ఆయన చదువంతా పాలకొల్లులోనే సాగింది. పగలంతా చదువుకుంటూనే రాత్రి సమయంలో అజంతా పెయింటింగ్ లో కమర్షియల్ పెయింటింగ్స్ వేస్తుండేవారు. అలా అనేక ఇబ్బందులు పడుతూ చదువుకున్నారు. సినిమాలు అంటే కోడి రామకృష్ణకు చాలా ఇష్టమట.
Advertisement
అలా మధ్య మధ్యలో సినిమా ప్రయత్నాలు కూడా చేసేవారట. పాలకొల్లు లోని లలితా కళా అంజలీ ద్వారా అనేక నాటకాలు కూడా వేసేవారట. ఆయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. ఇక అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలై అనేక సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. ఆయనకు ఇండస్ట్రీలో అనేక అవార్డులు కూడా వచ్చాయి. రఘుపతి వెంకయ్య నాయుడు అనే పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 2019లో కన్నుమూశారు.
also read:
- చిరంజీవితో సినిమా చేసి కెరీర్ కోల్పోయిన స్టార్ డైరెక్టర్ లు వీళ్లే..? చివరకి ఏం చేస్తున్నారంటే..?