Home » మైకేల్ వాన్: ఇలా చేస్తే.. RCB గెలవడం పక్కా..!

మైకేల్ వాన్: ఇలా చేస్తే.. RCB గెలవడం పక్కా..!

by Sravya
Ad

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారైనా కప్పు కొట్టాలని కోహ్లీ ఫ్యాన్స్ ఆర్సిబి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఈసాల కప్ కల ఇప్పటికీ కూడా తీరలేదు. గొప్ప బ్యాటర్లు వున్నా బౌలింగ్ వైఫల్యంతోనే ఆర్సిబి టైటిల్ అందుకోవట్లేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆర్సిబి ఓటమీకి ఇంకో ప్రధాన కారణం కూడా ఉందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ పేర్కొన్నారు. బెంగళూరు బ్యాటింగ్ లో కూడా జట్టు సక్రమంగా లేదని ప్రణాళిక లేదని ఆర్సిబి లో స్పష్టంగా అది కనబడుతుందని వివరించారు.

Advertisement

కేవలం కొంతమంది వ్యక్తుల ప్రదర్శన బట్టి విజయం రాదని పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్లు ని కొని జట్టుగా ఏర్పాటు చేసిన గెలుపు కష్టమని గత కొన్ని ఏళ్ళ నుండి బెంగళూరు చాటి చెప్తోంది అని అన్నారు. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, మాక్స్వెల్ వంటి అసాధారణమైన ప్లేయర్లు ఆర్సిబికి ఆడినా కూడా టైటిల్ రాలేదని అన్నారు. జట్టులో ప్రతీ స్థానానికి సరిపోయే ఆటగాళ్లు కావాలి. పాత్రని తెలుసుకోవాలి. పరిస్థితిని బట్టీ స్థానాలని మార్చుకోవాలి కాని ఇవన్నీ ఆర్సిబి చేస్తుందని నేను భావించట్లేదు. విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగిన వెంటనే ప్రత్యర్థి జట్టు లెఫ్ట్ ఆర్మీ స్పిన్నర్లతో బౌలింగ్ చేయిస్తోంది.

Also read:

Advertisement

Also read:

ఆఫ్ సైడ్ ఇద్దరు ఫీల్డర్ లని పెట్టి స్కోర్ చేయకుండా ఆపుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సిబి ఎలా ఆలోచించాలి..? ఇటువంటి సమయంలో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ని బరిలోకి దింపాలి విరాట్ని వన్ డౌన్ లో దించుతాం అని ప్లాన్ చేయాలి. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తో ఎడమ చేతి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దూకుడుగా అడి కొన్ని బౌండరీలు కొడితే తొలి ఓవర్ లోనే 13 నుంచి 15 పరుగులు సాధించవచ్చు. ఆర్సిబి అలా భిన్నంగా ఆలోచించట్లేదు జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నారని విజయాన్ని సాధిస్తుందని ధీమాతో ఆర్సిబి మేనేజ్మెంట్ ఉంటుందని కానీ ఆ ఆలోచనలు తప్పు అని మైఖేల్ వాన్ పేర్కొన్నారు. ఒక విజయం సాధించిన ఆర్సిబి ఇప్పుడు అందరికంటే చివరి స్థానంలో ఉంది చిన్న స్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ తో బెంగళూరు తలపడి ఓటమిపాలయ్యింది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading