లక్నో సూపర్ జేయింట్స్ బెంగళూరు మధ్య మే 1వ తేదీన భీకర పోరు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో 18 పరుగులతో బెంగుళూరు గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మరోసారి గొడవకు దిగారు. మ్యాచ్ అనంతరం ఇద్దరి మధ్య మాటలతూటాలు పేలాయి. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీశారు. అమిత్ మిశ్రా కోహ్లీని అడ్డుకోగా, కేఎల్ రాహుల్ గంభీర్ ను పక్కకు తీసుకెళ్లాడు.
READ ALSO :వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు
Advertisement
వీరి గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రూల్స్ ని అధిక్రమించినందుకు గాను వీరిద్దరికి భారీగా జరిమానా విధించారు. ఐపిఎల్ లో కోహ్లీ జీవితం ఏడాదికి 15 కోట్లు. కనీసం 14 మ్యాచ్లు ఆడతారు కాబట్టి ఈ లెక్కన ఒక మ్యాచ్ కు దాదాపు కోటి ఏడు లక్షలు అందుకుంటున్నాడు. అయితే కోహ్లీ మ్యాచ్ ఫీజులో బీసీసీఐ ఇప్పుడు 100% జరిమాన విధించడంతో ఈ మొత్తం అమౌంట్ కట్ చేసి మిగిలిన మొత్తాన్ని కోహ్లీకి ఇస్తారు.
Advertisement
READ ALSO : Silk Smitha : సిల్క్ స్మిత మళ్లీ పుట్టిందా… లేక ఆమె కూతురా…?
ఏ ఆటగాడికైనా ఇదే రూల్ వర్తిస్తుంది. కానీ స్లో ఓవర్ రేట్ కింద విధించిన జరిమానా మాత్రం ఫ్రాంచైజీనే చెల్లిస్తుంది. ఆటగాళ్ల జీతంలో ఎటువంటి కోత ఉండదు. అయితే ఇప్పుడు కోహ్లీ చెల్లించాల్సిన కోటి రూపాయలు స్వయంగా బెంగుళూరు ఫ్రాంచైజీనే చెల్లిస్తుందని తెలిపింది. దీంతో ఇప్పుడు కోహ్లీకి రూపాయి ఖర్చు లేకుండా పోయింది. చాలా సందర్భాల్లో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జరిమానాన్ని భరిస్తారు. ఈ లెక్కన గంభీర్ మ్యాచ్ ఫీజు 25 లక్షల రూపాయలను కూడా లక్నో ప్రాంచైజీ భరిస్తుందో లేదో చూడాలి.
READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్