Home » వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు

వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు

by Bunty

ప్రముఖ డాన్స్ మాస్టర్, ఢీ షో కొరియోగ్రాఫర్ ఆత్మ**త్య అందరినీ కలిసి వేసింది. డాన్స్ మాస్టర్ గా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన హఠాత్తుగా బలవన్మరణానికి పాల్పడడం సినీ ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేసింది. అప్పుల బాధతోనే ఆత్మ**త్యకు పాల్పడినట్లు సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు చైతన్య మాస్టర్. మాస్టర్ మరణంతో అతని కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.

READ ALSO : ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో దుమ్ములేపింది !

సెల్ఫీ వీడియోలో చైతన్య మాస్టర్ తన తల్లిదండ్రులకు, తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు క్షమాపణ చెప్పాడు. అప్పులు ఇచ్చిన వాళ్ళ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని, అందుకే సూ**డ్ చేసుకుంటున్నానని తెలిపారు. అయితే చైతన్య ఆత్మ**త్యపై కండక్టర్ ఝాన్సీ చేసిన వాక్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గత ఏడాది డిసెంబర్ 31న కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో కొంతమంది ఆర్టిస్టులు చైతన్యకు హ్యాండ్ ఇచ్చారని, దీనితో ఈవెంట్ ఆర్గనైజర్స్ మాస్టర్ కు రావాల్సిన అమౌంట్ ను ఆపేసారని దానివల్ల ఆయన అప్పు చేశారని పేర్కొంది.

READ ALSO : IPL 2023 : ప్రతీకారంతో కొట్టుకున్న కోహ్లీ, గంభీర్.. వీడియో వైరల్

That's the real reason behind Chaitanya master's suicide Conductor Jhansi Emotional About Dhee Show Choreographer Chaitanya Suicide

దాన్ని తీర్చేందుకు మరో అప్పు ఇలా అప్పులు చేసుకుంటూ పోయారని, చివరకు ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారంటు కండక్టర్ ఝాన్సీ కన్నీళ్ళ పర్యంతం అయింది. ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆ ఆర్టిస్టులతో కూర్చొని మాట్లాడి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఝాన్సీ అభిప్రాయపడింది. మొత్తానికి ఝాన్సీ చేసిన వాక్యాలతో చైతన్య సూ**డ్ వెనుక అసలు కారణాలు బయటపడ్డాయి.

READ ALSO :  Chikoti Praveen: థాయ్‌లాండ్ పోలీసులకు చిక్కిన చికోటి ప్రవీణ్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

Visitors Are Also Reading