రజత్ మనోహర్ పాటిదార్… ఎలిమినేటర్ మ్యాచ్ లో LSG బౌలర్లకు చుక్కలు చూపించి RCB ని సెమీస్ కు ప్రమోట్ చేసిన ఆటగాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ చేశాడు. 54 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన LSG 193 పరుగులకు ఆలౌట్ అయ్యి టైటిల్ రేసు నుండి నిష్క్రమించింది.
Advertisement
పాటిదార్ మద్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించాడు. మద్యప్రదేశ్ కు డొమెస్టిక్ క్రికెట్ ఆడే పాటిదార్ రైట్ హ్యాండ్ బ్యాటర్. ఆఫ్ స్పిన్నర్ . మొదట బౌలర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పాటిదార్ అండర్ 15 లో బ్యాటింగ్ పై దృష్టిపెట్టాడు. వ్యాపార కుటుంబానికి చెందిన పాటిదార్ తాత ప్రోత్సాహంతో క్రికెట్ లోకి దిగాడు.
Advertisement
2018–19 రంజీ ట్రోఫిలో 713 పరుగులు చేసి ఆ ఏడాది ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2021 వేలంలో పాటిదార్ ను RCB 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో మొదటి నుండి లక్నో బౌలర్లపై ఆదిపత్యం ప్రదర్శించాడు. ముఖ్యంగా రవి బిష్నోయ్ బౌలింగ్ లో 3 సిక్సులు, 2 ఫోర్లు బాదాడు. ఆటమొత్తంలో 3 సార్లు పాటిదార్ ఇచ్చిన క్యాచ్ లను మిస్ చేశారు లక్నో ఆటగాళ్లు.
Watch Video – Patidar Six:
— Guess Karo (@KuchNahiUkhada) May 25, 2022