సాధారణంగా కొన్ని పాత్రలు అనుకునేటప్పుడు ఆ పాత్ర కోసం ఈ నటుడు అయితే సరిపోతారని దర్శకులు అనుకుంటారు. కానీ కథ పరంగానో ఇతర కారనాల వల్లనో మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. కొన్ని సార్లు అలా తమ నిర్ణయం మార్చుకోవడంతోనే మంచి జరిగిందని తరవాత అనుకుంటారు. రాజమౌళి కూడా ఒకసంధర్బంలో అనుకున్నారట. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఈగ కూడా ఒకటి. ఈ సినిమాలో నాని హీరోగా నటించగా సమంత హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా కన్నడ స్టార్ సుధీప్ ఈ సినిమాలో విలన్ గా నటించారు.
భారీ గ్రాఫిక్స్ తో విభిన్న కథతో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా చిరలో తాగుబోతు రమేష్ ఎంట్రీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం రాజమౌళి మొదటగా రవితేజను అనుకున్నారట. కానీ రవితేజ అయితే ఆయనకు ఉన్న ఇమేజ్ కారణంగా సమంతో కలపాల్సి వస్తుంది. అంతే కాకుండా కామెడీ పాత్ర కాబట్టి రవితేజ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ నిర్ణయాన్ని జక్కన్న వెనక్కి తీసుకున్నారట. నిజానికి రాజమౌళి తన నిర్ణయం వెనక్కి తీసుకుని మంచి పనే చేశారని చెప్పాలి.
Advertisement
Advertisement
also read : నిన్నేపెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
లేదంటే రవితేజను సమంతతో కలపకపోయినా…కామెడీ పాత్రలో రవితేజను చూపించినా మాస్ మహరాజ్ అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చేది. ఇదిలా ఉంటే రాజమౌళి రవితేజ కాంబోలో విక్రమార్కుడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా తరవాతనే రవితేజ గ్రాఫ్ కూడా పూర్తిగా మారిపోయింది. మరోవైపు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు. అంతే కాకుండా బాలీవుడ్ లో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.