సినిమాల్లోకి కొంతమంది హీరోలు అయ్యేందుకు వచ్చి నేరుగా హీరో అయిపోతే మరికొందరు మాత్రం హీరోగా అవకాశం రావడానికి ఎంతో కష్టపడుతుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా అవతారం ఎత్తుతారు. ప్రస్తుతం స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరుతున్న నాని కూడా అందులో ఒకరు. అంతే కాకుండా ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే తన కెరీర్ ను మొదలు పెట్టాడు. అనుకోకుండా రాజ్ తరుణ్ కు ఉయ్యాల జంపాల సినిమాలో అవకాశం రావడం ఆ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో వరుస ఆఫర్లు అందుకున్నాడు.
Advertisement
ఇక టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మాస్ మహరాజ్ రవితేజ కూడా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గానే పనిచేశాడు. అంతే కాకుండా రవితేజ నాగర్జున హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా నిన్నే పెళ్లాడతాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఈ సినిమాలో నాగార్జున ఓ బైక్ రేసింగ్ సీన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ బైక్ సీన్ కోసం నాగార్జున జుట్టు పైకి ఎగరడానికి రవితేజ కూడా ఫ్యాన్ పట్టుకున్నవారిలో ఒకరు.
Advertisement
అలా కెరీర్ మొదలు పెట్టిన రవితేజ కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. అలా అంచెలంచెలుగా హీరో వరకూ ఎదిగాడు. నాగర్జునకు ఫ్యాన్ పట్టుకునన్న రవితేజ సీతారామరాజు సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆజ్ కా గుండారాజ్ అనే సినిమాతో మొదటి సారిగా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరవాత ప్రతిబంధనం, కర్తవ్యం లాంటి వరుస సినిమాలు చేశాడు. ఇక రీసెంట్ గా రవితేజ క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఖిలాడీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.