సోషల్ మీడియా వాడకం అనేది ఎక్కువ అయిన తర్వాత పుకార్లు అనేవి కూడా ఎక్కువయ్యాయి. ఏదో విషయాన్ని కల్పించి రాయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సెలబ్రెటీల మీద ఇలాంటి పనులు ఎక్కువ జరుగుతుంటాయి. అయితే కొందమంది వాటిని సీరియస్ గా తీసుకుంటే మరి కొందరు వదిలేస్తారు. ఇక క్రికెట్ ప్రపంచంలో ఈ మధ్యే జడేజా పైన ఎక్కువ వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిపైన జడ్డు స్పందించాడు.
Advertisement
ప్రస్తుతం టీం ఇండియాతో కలిసి ఆసియా కప్ కోసం యూఏఈ వెళ్లిన జడేజా ఈరోజు హాన్ కాంగ్ తో మ్యాచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఇక అందులోనే పుకార్లపైన తన కామెంట్స్ చేసాడు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టుకొని కూర్చుంటే ఎవరు ముందుకు వెళ్ళలేరు అని జడేజా అన్నారు. ఇక నా మహి కూడా ఈ మధ్య ఎక్కువ పుకార్లు వస్తున్నాయి. చెంన్సు సూపర్ కింగ్స్ జట్టుకు నాకు గొడవ అయ్యిందని.. నేను ఆ జట్టు నుండి వెళ్ళిపోతున్నాను అని వారే చెబుతున్నారు.
Advertisement
అలాగే నాకు ఈ ఏడాది జరగబోయే ప్రపంచ కప్ జట్టులో కూడా చోటు ఉండదు అని రాస్తున్నారు. ఇక నేను చనిపోయాను అని కూడా ప్రచారం చేసారు. ఇంతకంటే పెద్ద పుకారు ఏమైనా ఉంటుందా అని జడేజా అన్నాడు. అందుకే నేను వాటికి పట్టించుకోని అని తెలిపాడు. అయితే ఈ ఏడాది మే నెలలో రవీంద్ర జడేజా అనే పేరు ఉన్న ఓ సీనియర్ సౌ రాష్ట్ర క్రికెటర్ చనిపోగా.. అది ఈ జడేజానే చనిపోయాడు అని వార్తలు రాసారు కొందరు.
ఇవి కూడా చదవండి :