రాళ్లు పోగుచేసుకుని వజ్రాలను మిస్ చేసుకున్నట్టు కొన్నిసార్లు హీరోలు సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకుని ఫ్లాప్ సినిమాలను ఎంచుకుంటారు. ముందుగా తమ వద్దకు వచ్చిన సూపర్ హిట్ అయ్యే కథను రిజెక్ట్ చేసి ఫ్లాప్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఆ తరవాత మిస్ చేసుకున్న సినిమా రిజల్ట్ చేసి షాక్ అవుతారు. ఎలాంటి కథను ఎంచుకుంటున్నాం అనేదానిపై కూడా ముందే అవగాహన ఉండాలి లేదంటే ఆ తరవాత బాధపడక తప్పదు.
Advertisement
ఇక తాజాగా కల్యాణ్ రామ్ సూపర్ హిట్ అందుకున్న బింబిసార సినిమాను కూడా ముందుగా ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశారట. ఆగస్టు 5న ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బింబిసార సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బింబిసారుడి కథ ఆధారంగా ఈ సినిమాను తెరెక్కించారు. ఈ సినిమాలో కేథరిన్ థెరిస హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఈ చిత్రానికి నూతన దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పోస్ట్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుండి బాహుబలి, మగధీర మాదిరిగా పోస్టర్ లు ఉన్నాయని ఆ రేంజ్ లో సినిమా ఉంటుందో అని ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ సినిమా పై కల్యాణ్ రామ్ మాత్రం ముందు నుండి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఇక సినిమా విడుదలయ్యాక ట్రోలర్స్ నోరు మూయించాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమాను ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడు. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమా కథను ముందుగా రవితేజ కు చెప్పారట. కానీ రవితేజ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇక రవితేజ రీసెంట్ గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో రవితేజ ఫ్లాప్ సినిమా కోసం సూపర్ హిట్ ను మిస్ చేసుకున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ : శోభన్ బాబు “సర్పయాగం” సినిమాకు ఒంగోలు టిప్ టాప్ రెడ్డికి ఉన్న సంబంధం గురించి తెలుసా..?