Home » వన్డే ఫార్మట్స్ లో ఓవర్లను కుదించనున్నారా…?

వన్డే ఫార్మట్స్ లో ఓవర్లను కుదించనున్నారా…?

by Azhar
Ad

క్రికెట్ చరిత్రలో మొదట కేవలం టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే జరిగేవి. ఆ తర్వాత వన్డేలు వచ్చాయి. ఆ ఆతర్వాత టీ20 క్రికెట్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు లీగ్ క్రికెట్ లో టీ10 కూడా జరుగుతుంది. కానీ ఇందులో ఏ ఫార్మాట్ యొక్క ప్రత్యేకత అనేది ఆ ఫార్మాట్ కు ఉంటుంది. అయితే గత ఏడాది వరకు టెస్ట్ క్రికెట్ అనేది చనిపోతుంది అనే కామెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఉన్న ఆటగాళ్లలో చాలామంది టెస్ట్ క్రికెట్ ను ఇష్టపడుతున్నారు. అందువల్ల ఆ కామెంట్స్ అనేవి పోయాయి. కానీ ఇప్పుడు మరో వాదన అనేది వస్తుంది. అంటేంటంటే.. వన్డే క్రికెట్ చనిపోతున్నది అని అంటున్నారు.

Advertisement

క్రికెట్ లో దిగ్గజాలుగా పేరు అనేది తెచుకున్న చాలా మంది ఆటగాళ్లు వన్డే క్రికెట్ ఇక కనిపించదు అంటున్నారు. ఈ ఫార్మాట్ కు ఆదరణ అనేది తగ్గిపోతుంది అని.. అందుకే చాలా మంది ఆటగాళ్లు దీనిపైన అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ మధ్య బెన్ స్టోక్స్ ఈ ఫార్మాట్ నుండి తప్పుకుని తర్వాత మరి ఎక్కువయ్యాయి. అయితే వీరి పైన పాకిస్థాన్ మాజీ కెప్టెన్.. షాదీద్ ఆఫ్రిది స్పందించాడు. ఈ వన్డే ఫార్మాట్ ను కాపాడాలంటే.. దీనిని 50 ఓవర్ల నుండి 40 ఓవర్ల ఆటగా మార్చాలని అన్నాడు.

Advertisement

అయితే ఆఫ్రిది చేసిన ఈ కామెంట్స్ ను..భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా అంగ్గింకరించాడు. కాలం అనేది మారుతుంది. అందువల్ల దానితో పాటుగా మనం కూడా మారాలి. ఇండియా మొదటి వన్డే ప్రపంచ కప్ గెలిచిన సమయంలో ఈ వన్డేలో 60 ఓవర్ల ఆట ఉండేది. కానీ ఆ తర్వాత అది బోర్ అవుతుంది అన్ని దానిని 50 ఓవర్లకు మార్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది ప్రజలకు బోర్ కొడుతుంది. ఎన్నో ఏళ్లుగా వన్డే క్రికెట్ 50 ఓవర్లతో జరుగుతుంది. కాబట్టి దీనిపైన ఆతృత అనేది పెంచడానికి దీనిని 50 ఓవర్ల నుండి 40 ఓవర్లు చేయడంలో తప్పు లేదు అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

సెంచరీలు చేసినప్పుడు మాట్లాడలేదు… ఇప్పుడు కూడా మాట్లాడకూడదు..!

నేను ఇలా ఎదగడానికి ఆ ఎడిటర్ కారణం..!

Visitors Are Also Reading