Home » ముంబై ఇండియన్స్ లోకి టాప్ ప్లేయర్స్ !

ముంబై ఇండియన్స్ లోకి టాప్ ప్లేయర్స్ !

by Bunty
Ad

ఐపీఎల్లో మొదట 5సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు సాధించింది ముంబై ఇండియన్స్. కానీ 2022లో మాత్రం అంచనాలు తలకిందులుగా చేస్తూ చివరిస్థానంలో నిలిచి ఘోరంగా విఫలమైంది. ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశపడ్డారు. కానీ 2023 ఐపీఎల్ లో మాత్రం ముంబై ఇండియన్స్ మంచి ప్రదర్శన చేసింది. మరో టైటిల్ కొట్టకపోయినా ప్లే ఆప్స్ కు చేరి ఫ్యాన్స్ ను అలరించింది. ఇప్పుడు 2024 ఐపీఎల్ మీద కన్ను వేసింది.

Advertisement

కొంతమందిని రిలీజ్ చేయడంతో పాటు మరో ముగ్గురు ప్లేయర్స్ ను మినీ వేలంలో కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే స్కెచ్ వేసింది. జోఫ్రా ఆర్చర్, స్పిన్నర్ హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, క్రిష్ జోర్డాన్ లను రిలీజ్ చేయాలని భావిస్తోంది. వీరి స్థానంలో రవి బిష్నోయ్, అక్షర పటేల్ క్రిష్ వొక్స్ లను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల రవి బిష్నోయి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్ లో కూడా రాణించాడు. అతను జట్టులో ఉంటే ముంబై ప్రతిష్టమవుతుందని ముంబై భావిస్తోంది. రవి బిష్నోయ్ ప్రస్తుతం లక్నో సూపర్ జేయింట్స్ కు ఆడుతున్నాడు. వచ్చే సీజన్లో అతను జట్టు మారాలని భావిస్తున్నారు. కాబట్టి అతన్ని మినీ వేలంలో కొనుగోలు చేయాలని ముంబై ప్రణాళికలు చేస్తోంది. అలాగే క్రిష్ వోక్స్ పై కూడా ముంబై టార్గెట్ పెట్టింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్ లో క్రిష్ వోక్స్ అద్భుత ప్రదర్శన చేశాడు.

Advertisement

బ్యాటింగ్, బౌలింగ్లో రాణించే సత్తా క్రిష్ వోక్స్ కు ఉండడంతో అతన్ని దక్కించుకునేందుకు ప్రయత్నం చేయాలని చూస్తోంది. ఐపీఎల్లో వోక్స్ కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ లో 21 మ్యాచ్లు ఆడిన వోక్స్ 30 వికెట్లు తీశాడు. ఇక అర్సిసిబిలో ఫాస్ట్ బౌలర్ గా ఉన్న హర్షద్ పటేల్ 16 సీజన్లలో మాత్రం అంతగా రాణించలేదు. ఈ సీజన్లో 13 వికెట్లు మాత్రమే తీశాడు. దాంతో ఆర్సిబి అతన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉంది. ఒకవేళ ఆర్సిబి కనుక అతన్ని వదులుకుంటే ముంబై హర్షద్ పటేల్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ముగ్గురు ముంబై జట్టులో చేరితే రోహిత్ సేనకు మరింత బలం చేకూరుతుంది. రోహిత్ సేన కూడా మరోసారి కచ్చితంగా ఛాంపియన్ గా నిలవాలని ప్లాన్ లో ఉంది. డిసెంబర్లో జరిగే మినీ వేలంలో ముంబై తాను అనుకున్న ప్లేయర్స్ ను తీసుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.

Visitors Are Also Reading