రామాయణంలో అందరికి విలన్ గా కనిపించిన రావణాసురుడు బ్రాహ్మణ కుమారుడే అని మీకు తెలుసా? సీతని మోహించి జీవితాన్ని పోగొట్టుకున్నాడు, కానీ వాస్తవానికి రావణాసురుడు గొప్ప శివ భక్తుడు. ఆయన చాలా నియమ నిష్టలతో ఉంటాడన్న సంగతి అందరికి తెలుసు. పరస్త్రీ వ్యామోహం లేకుంటే, ఆయన గొప్ప పండితుడే. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు కైకసి,విశ్రవ మహర్షిలకు జన్మించినవాడు. విశ్రవ మహర్షి బ్రాహ్మణ జాతికి చెందిన వాడే అయినా కైకసి రాక్షస జాతి స్త్రీ. వీరికి పుట్టిన రావణుడికి సత్వ గుణం, తమో గుణం ఎక్కువగా ఉన్నాయి.
Advertisement
అసలు రాక్షస జాతి స్త్రీ అయిన కైకసి విశ్రవ మహర్షిని ఎందుకు వివాహం చేసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణకాలంలో మాలి, సుమాలి మరియు మాలేవన్ అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మ దేవుని గురించి పూజించారు. బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై వారికి అత్యంత బలవంతులుగా వరం అనుగ్రహించారు. తరువాత వారు దేవతలపై దండయాత్ర చేసారు. వారు ఇంద్రలోకంలో దాడి చేస్తున్న సమయంలో విష్ణువు కూడా అక్కడకు వచ్చి వారిపై యుద్ధం చేసారు. కొద్దిసేపటికే చాలా మంది రాక్షసులు సంహరించబడ్డారు. మాలి కూడా ఈ యుద్ధంలో మరణిస్తాడు.
దీనితో, సుమాలి మరియు మాలేవన్లు కుటుంబంతో కలిసి పాతాళంలో దాక్కుంటారు. ఎంతకాలం ఇలా దాక్కోవాలో అని వారు భావించారు. చివరకు సుమాలి ఓ ఆలోచన చేసి తన కుమార్తె ఐన కైకసి ని పిలిచి బ్రాహ్మణ లోకంలోని విశ్రవ మహర్షిని పెళ్ళి చేసుకోవాల్సిందిగా కోరాడు. మన సంతతి అభివృద్ధి కోసం విశ్రవ మహర్షిని పెళ్లి చేసుకుని కుబేరుడి లాంటి తేజోవంతుడైన కుమారుడిని కనమని చెప్తాడు. అయితే పాతాళ లోకం నుంచి పృథ్వి లోకానికి వచ్చిన కైకసి విశ్రవ మహర్షిని కలిసి తాను వచ్చిన విషయాన్నీ చెబుతుంది.
Advertisement
విశ్రవ మహర్షి ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అయితే.. తమకు పుట్టబోయే పిల్లలు అతివీర భయంకరులుగా పుడతారని ముందే చెప్తాడు. బ్రాహ్మణ లోకంలో అటువంటి సంతానం తనకు ఇష్టం లేదని కైకసి చెబుతుంది. కైకసి అవడానికి రాక్షస జాతి స్త్రీ అయినా ఆమె ధర్మాత్మురాలు. ఆమె కోరికను మన్నించిన విశ్రవ మహర్షి మూడవ కొడుకు నాలా ధర్మాత్ముడు అవుతాడని సెలవిస్తాడు. అతను చెప్పినట్లే మొదట పది తలలతో ఒక బాలుడు జన్మిస్తాడు. అతనికి దశాగ్రహ అని నామకరణం చేస్తారు. అతనినే రావణ అని పిలుస్తారు. ఇక రెండవ బాలుడు అతిభయంకరంగా పొడవు, భారీ శరీరంతో జన్మిస్తాడు. అతనికి కుంభకర్ణుడు అని నామకరణం చేస్తారు. ఇక మూడవ కుమారుడు విభీషణుడు. రావణుడు, కుంభకర్ణుడు ఇద్దరూ గత జన్మలో విష్ణువు వద్ద ద్వారపాలకులైన జయ విజయ లు అని అందరు విశ్వసిస్తారు. విభీషణుడు తండ్రి లానే ధర్మ పరాయణుడు. ఇక రావణుడు బ్రాహ్మణ కుమారుడు అయినప్పటికీ.. రాక్షస జాతికి చెందిన స్త్రీకి జన్మించడం వలన కొన్ని రాక్షస గుణాలు కూడా అలవడ్డాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!
ఈ 4 లక్షణాలు కనుక భార్యలో ఉంటే.. భర్త పరాయి ఆడదాని స్వాధీనమైనట్లే..!
మీ భార్య గొడవ పడితే ఇలా కూల్ చేయండి !